మా దేశంలో వ్యభిచారులు కూడా గ్రాడ్యుయేట్స్..క్యాస్ట్రో

Posted November 26, 2016

Image result for field castro

మా దేశం లో ‘‘విప్లవం వల్ల కలిగిన ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే,వ్యభిచారులు సైతం కాలేజ్ గ్రాడ్యుయేట్లే’’ అన్నారట దర్శకుడు ఆలివర్ స్టోన్ తో క్యాస్రో మాట్లాడుతూ 10 మంది అమెరికా అధ్యక్షుల అరాచకాలను ప్రశ్నించిన, ఇప్పుడు మృతి చెందిన క్యాస్ట్రో అయన మాట్లాడిన మాటల గురించి తెలుసుకుందాం ..

  • ‘‘నన్ను అంతం చేయండి. దానికి అంత ప్రాధాన్యమేమీ లేదు. చరిత్ర నన్ను విముక్తుణ్ణి చేస్తుంది’’ 1953లో అయన పై దాడి జరిగినప్పుడు అన్న మాట ఇది
  • ‘‘నేను 82 మందితో విప్లవాన్ని ప్రారంభించాను. దాన్ని మళ్ళీ చేయవలసి వస్తే, 10 లేదా 15 మందితో చేస్తాను, సంపూర్ణమైన విశ్వాసంతో చేస్తాను. మీకు నమ్మకం, కార్య ప్రణాళిక ఉన్నట్లయితే మీరు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారనేది పట్టించుకోవాల్సిందేమీ కాదు’’ ఈ మాటలు ఎందరిలోనో ప్రేరణ కలిగించాయి.
  •  ‘‘నేను నా గడ్డాన్ని తీసేయాలనుకోవడం లేదు, ఎందుకంటే నేను దానికి అలవాటుపడ్డాను, నా గడ్డంలో నా దేశానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. సుపరిపాలన హామీని నెరవేర్చినపుడు నా గడ్డాన్ని తీసేస్తాను’’ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అన్న మాటలివి .
  • ‘‘నన్ను బలోపేతం చేస్తున్న సిద్ధాంతాలకు, ఆ అసాధారణ వ్యక్తి, జీసస్
  •  ‘‘ నాకు ఎనభయ్యేళ్ళ వయసు రావడం చాలా సంతోషంగా ఉంది. కనీసం ఓ పొరుగు దేశమైనా తోడు లేకుండా, ప్రపంచంలోనే అత్యధిక శక్తివంతమైన దేశం నన్ను రోజూ చంపడానికి ప్రయత్నించడం వల్ల ఇంత కాలం బతుకుతానని నేనెప్పుడూ ఊహించలేదు,2006 లో లాటిన్ అమెరికా సదస్సులో కాస్ట్రో అన్న మాటలివి ..