ఎన్టీఆర్.. మొన్న ఎవరో అన్నాడు.. ఈరోజు అభిమానిని అంటున్నాడు..!

Posted December 2, 2016

Image result for ntr

కొద్దిరోజులుగా ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదు అసలు ఇంతవరకు తనను కలవలేదు అన్న తమిళ దర్శకుడు హరి మాటలు టాలీవుడ్ లో సంచలనాలను రేపిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ ను షేక్ చేసే తారక్ స్టామినా టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ కు తెలుసు. మరి అలాంటిది తమిళ దర్శకుడు ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న దర్శకుడు ఎన్టీఆర్ తెలియదు అని చెప్పడం అందరిని ఆశ్చర్య పడేలా చేసింది.

విషయం తన దాకా రావడంతో ఎట్టకేలకు మరోసారి ఈ విషయం పై స్పందించాడు కోలీవుడ్ డైరక్టర్ హరి. సింగం సీరీస్ లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈయన ఈ నెల రెండో వారంలో సూర్య ఎస్-3 తో రాబోతున్నాడు. అయితే ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానినని.. ఆయనతో కథా చర్చల్లో కూడా పాల్గొన్నానని.. అప్పుడు అది కుదరలేదు కాని త్వరలోనే ఆయనతో ఓ సినిమా చేస్తానని అన్నారు. నేను తను ఎవరో తెలియదు అని ఎక్కడ అనలేదని తను నటించిన టెంపర్ సినిమా రెండు సార్లు చూశానని అన్నాడు హరి. మరి ఎవరు పుట్టించారో ఎలా పుట్టించారో తెలియదు కాని తారక్ ఎవరో తెలియదు అన్న విషయం మీద ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు. మరి హరి ఇచ్చిన ఈ క్లారిటీ వారిని శాంత పరుస్తుందో లేదో చూడాలి.