చరణ్ మిలియన్ ఖాతా తెరిచాడోచ్..!

Posted December 14, 2016

Finally Ram Charan Crossed Milion Mark At Overseasమెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా అనుకున్నట్టుగానే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో మిగతా హీరోలందరు మిలియన్ క్లబ్ లో చేరి సందడి చేస్తుంటే చెర్రి మాత్రం ఇంకా ఆ ఫీట్ సాధించలేదని మెగా అభిమానులు బెంగ పెట్టుకున్నారు. ఎలాగైనా సరే ధ్రువతో మిలియన్ మార్క్ టచ్ చేయాలని ప్రయత్నించిన చెర్రి ఎట్టకేలకు అది సాధించేశాడు.

తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ గా ధ్రువ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. కంటెంట్ అలానే ఉంచి తమిళంలో కన్నా తెలుగులో ఇంకాస్త స్టైలిష్ గా సినిమా తీసి హిట్ అందుకున్నారు. సినిమాలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా నీరాజనాలు అందిస్తున్నారు. కొద్దికాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న చరణ్ కు ధ్రువ ఆ దాహం తీర్చిందని చెప్పొచ్చు.

చరణ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో ఈ ధ్రువ కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. మెగా పవర్ స్టార్ గా తన మార్క్ నటనతో ఆకట్టుకున్న చెర్రి ఇక నుండి ప్రతి సినిమాకు ఇదే రేంజ్ కలక్షన్స్ తో దూసుకుపోవాలని ఆశిద్దాం.