అభిమాని కోసం పవన్..!

Posted November 16, 2016

Pawan Kalyan trivikram nitin new movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమాని కోసం నిర్మాతగా మారాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరంటే ఇంకెవరు పవన్ అభిమాని నితిన్ అని తెలుస్తుంది. లవర్ బోయ్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న నితిన్ ఈ మధ్యనే అఆతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం హను రాఘవపుడి డైరక్షన్లో సినిమా చేస్తున్న నితిన్ కృష్ణ చైతన్య అనే నూతన దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాడు.

ఈ మూవీను పవన్, త్రివిక్రం కలిసి నిర్మిస్తుండటం విశేషం. తన సినిమా ఆడియోకి పవన్ వస్తే చాలు అనుకునే నితిన్ కు ఏకంగా పవర్ స్టార్ నిర్మాణంలోనే నటించే ఛాన్స్ అంటే ప్రస్తుతం నితిన్ ఏ రేంజ్ హ్యాపీగా ఉంటాడో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా తన సినిమాలకే తన నిర్మాణ భాధ్యతలను మోసే పవన్ ప్రత్యేకించి ఓ బయట హీరోని ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి.

మరి పవన్ ఆయనకు తోడుగా త్రివిక్రం ఈ ఇద్దరు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డ్యాం షూర్ హిట్ అని మాత్రం చెప్పేయొచ్చు. తన దర్శకత్వంలో సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే పని పెట్టుకున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. మరి మొదటి ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.