పార్లమెంట్‌ను స్తంభింపచేయండి: పవన్‌

freeze parliament pawan suggestionప్రధాని నరేంద్రమోదీ అంటే తనకు అమితమైన గౌరవం ఉందని అయితే అది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేంత తనకు లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని, అక్కడేమీ బ్రహ్మరాక్షసులు లేరని అక్కడ ఉంది కూడా మనలాంటి మనుషులే కదా అని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ఎంపీలు మేడమ్‌.. మేడమ్‌.. అని బతిమలాడేవారని, ఇప్పుడు ఎంపీలు సార్‌.. సార్‌.. అని బతిమలాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలకు సూచించారు. రాజకీయ పార్టీ లక్ష్యం ప్రజాశ్రేయస్సు అని తన పోరాటంలో తాను గెలవొచ్చు.. ఓడిపోవచ్చు.. వెనకడుగు వేయనని పవన్‌ స్పష్టం చేశారు.

గోసంరక్షణ చేయాలంటే ప్రతి భాజపా కార్యకర్త ఒక ఆవును పెంచుకోమనండని పవన్‌ సూచించారు. గోమాత పేరుతో సమస్యలను గాలికి వదిలేయవద్దని అన్నారు. తెదేపా ప్రభుత్వం, విపక్షాలు ఒకటే మాటగా ఉండాలన్న పవన్‌.. అధికారంలో ఒకలా, ప్రతిపక్షంలో ఒకలా ఉండకూడదని పేర్కొన్నారు.