గాలి కన్నీళ్ల వెనుక?

 Posted November 2, 2016

gali janardhan reddy crying when he is saw his pets
కుమార్తె బ్రాహ్మణి పెళ్లి పనుల కోసం దాదాపు ఐదేళ్ల తర్వాత గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లారు. ముందు దేవాలయాలకి,తర్వాత తాము నడుపుతున్న వృద్ధాశ్రమానికి,చివరగా సొంత ఇంటికి వెళ్లారు.అన్ని చోట్ల భావోద్వేగాలు పెల్లుబికినా గాలి బాగానే నియత్రించుకున్నారు.ఇంటికొచ్చి ఆ ముగ్గుర్ని చూడగానే మాత్రం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.ఇంతకీ ఆ ముగ్గురు అయన పెంపుడు కుక్కలు. చిన్నోడా,పెద్దోడా,టైగర్ అని పిలుచుకునే మూడు కుక్కలు ఐదేళ్ల తర్వాత కూడా ఆయన్ని చూడగానే దగ్గరికెళ్లి ప్రేమగా గాలిని వదిలిపెట్టలేదు.అప్పట్లో ఎంత పని వున్నా ఆయనే వాటికి దగ్గరుండి ఆహారం ఇచ్చేవారట.ఇప్పుడు వాటి విశ్వాసాన్ని,ప్రేమని చూసిన గాలికి కన్నీళ్లు ఆగలేదంట. ఇదండీ గాలి కన్నీళ్ల వెనుక కధ.