కమలం గూటికి గాలి..?

0
71

Posted May 10, 2017 at 17:51
gali janardhan reddy join in bjp

గాలి జనార్దన్ రెడ్డి….తెలుగు రాష్ర్టాలు పొరుగున ఉన్న కర్ణాటకలోనే కాదు…భారతదేశ రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అవసరం లేదు. మైనింగ్ కింగ్ కర్ణాటక పర్యటక శాఖ మాజీ మంత్రి. కొద్దికాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున్నే చర్చ జరిగింది. అక్రమ గనుల తవ్వకం కేసులో జైలు జీవితం గడిపిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తరువాత కుమార్తె పెళ్లి చేసిన గాలి జనార్దన్ రెడ్డి దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు తెరతీశారు.

అయితే ప్రత్యక్ష రాజకీయాలకు గాలి జనార్దన్ రెడ్డి దూరంగా ఉంటారని ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు కారణమని విశ్లేషణలు సాగాయి. అయితే దీనికి చెక్ పెడుతూ గాలి జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చిచెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని గాలి జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాదిస్తోందని జోస్యం చెప్పారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తారని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను బీజేపీలో ఓ సామాన్య కార్యకర్త అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. బళ్లారీ జిల్లా నుంచి పోటీ చెయ్యరాదని ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అయితే అధిష్టానం ఆదేశిస్తే గదగ్ నుంచి పోటీ చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని గాలి జనార్దన్ రెడ్డి వెల్లడించారు.