గాలి..రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ..?

Posted November 18, 2016

gali janardhan reddy re-entry in politics
రాజకీయాల్లోకి మళ్ళీ గాలి జనార్దనరెడ్డి మరోసారి రాజకీయాలవైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వినవస్తున్నాయి. కుమార్తె వివాహం పుణ్యమా అని నెల రోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారిన గాలి జనార్దనరెడ్డి రాజకీయాలలో ప్రవేశించాలని భావిస్తున్నారట . ప్రస్తుతం 2011 సెప్టెంబరు 5న గనుల అక్రమాల కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ సారథ్యంలోని బృందం బళ్లారిలో అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన కేసులనుంచి బయటపడేందుకు చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొట్టింది. ఇటీవలే నిబంధనల బెయిల్‌తో బయటకు వచ్చారు.

ఆడంబరంగా పెళ్లి చేసి దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా పార్లమెంటు ఉభయసభల శీతాకాల సమావేశాల ఆరంభం రోజే చర్చకు కారణమయ్యారు.జాతీయ స్థాయిలోనూ ప్రముఖులను ఆహ్వానించారు.కొందరు గాలి కుమార్తె వివాహానికి హాజరైతే ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తోందనని వెనుకంజ వేశారు. కర్ణాటకకు చెందిన బీజేపీ మాజీ సీఎం లు యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్‌, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు, ప్రస్తుత మంత్రులు పరమేశ్వర్‌, డీకే శివకుమార్‌తోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏ పార్టీ కూడా ‘గాలి’ని ఆహ్వానించేది పరిస్థితులు కనిపించడం లేదు గతంలో లో ఆయన బీజేపీలో కీలక నేతగాను, మంత్రిగాను కొనసాగినందున అదే పార్టీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అనే ఊహ గానాలు వస్తున్నాయి .