ఘాజీ ప్రీమియర్ షో రివ్యూ

Posted February 15, 2017

ghazi premier show reviewచిత్రం: ఘాజీ
తారాగణం : రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ
సంగీతం : కె. కృష్ణ కుమార్

నిర్మాత : అన్వేష్ రెడ్డి, వెంకట్రమణా రెడ్డి, ప్రసాద్ వి పొట్లూరి
దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

బాహుబలి సినిమాతో  రానా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత కేవలం రుద్రమదేవి సినిమాలో మాత్రమే నటించిన రానా ఇప్పుడు ఘాజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సబ్ మెరైన్ వార్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కడం, పీవీపీ లాంటి పెద్ద సంస్ధ ఈ సినిమాను రూపొందించడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హైప్ ను మరింత పెంచడానికి ఈ రోజు ప్రీమియర్ షోను వేసింది చిత్రయూనిట్. మరి  ఘాజీ ప్రీమియర్ షో రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇక కధ ఏంటంటే:

ఈ సినిమాలో కేకే మీనన్.. కమాండెంట్ రణ్ విజయ్ సింగ్ గా, రానా.. లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మగా నటించారు.

1971 ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఒకే దేశంగా తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ లు గా ఉంటాయి. అయితే పశ్చిమ పాకిస్థాన్ నుంచి వేర్పాటు కోసం  తూర్పు పాక్ లో గొడవలు జరుగుతుంటాయి. దీంతో తూర్పు పాక్ నుండి శరణార్ధులు భారత సరిహద్దుకు చేరుతుంటారు. భారత్… వారికి సహాయం చేస్తోందని భావించిన పాక్ ఆర్మీ పరిస్థితులను తమ అధీనంలోకి తెచ్చుకోడానికి కుట్ర పన్నుతుంది.  అయితే పాక్ ఎత్తుగడలను ముందే పసిగట్టిన భారత నేవీ భారత సముద్ర జలాల్లో గస్తీ కోసం ఎస్ 21 సబ్ మెరైన్ పంపాలని భావిస్తుంది. ఆ సబ్ మెరైన్ కి రణ్ విజయ్ సింగ్ కెప్టెన్ గా ఉంటాడు. శత్రువులతో ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అని ఆలోచించే ఆవేశపరుడు రణ్ విజయ్  కెప్టెన్ గా ఉంటే  అనవసరంగా యుద్ధం కొని తెచ్చుకోవటమే అని నావల్ అధికారులు భావిస్తారు. దీంతో విజయ్ సింగ్ కు తోడుగా లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మను కూడా  పంపుతారు.

ఈ ఆపరేషన్ లో భాగంగా పాక్..  పిఎన్ఎస్ ఘాజీ సబ్ మెరైన్ ను భారత జలాల్లోకి పంపిస్తుంది. ఈ ఘాజీ సబ్ మెరైన్..  భారత సబ్ మెరైన్ కన్నా ఎన్నో రెట్లు వేగంగా, శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ ఆపరేషన్ ను రణ్ విజయ్ సింగ్ , అర్జున్ వర్మలు ఎలా నిర్వహించారు..? చివరికి ఎవరు గెలిచారు అనే ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

ఇక కధనం ఏంటంటే:

1971లో భారత్- పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ద కధే   ఘాజీ సినిమా.  ఈ సినిమా అంతా ఒక్క సబ్ మెరైన్ తో సాగుతుంది.

 ఇక ఎవరు ఎలా చేశారంటే:

కేకే మీనన్ రోల్ సినిమాకు ప్రాణం పోసింది. ఆవేశపూరిత  కెప్టెన్ గా అతని యాక్టింగ్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ పాత్రలో రానా అదరగొట్టాడు. అధికారుల ఆదేశాలను పాటించే సిన్సియర్ అధికారిగా, దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడని యోధుడిగా రానా నటన సూపబ్. తాప్సీ, నాజర్, ఓం పురిలు మిగతా వారి నటన కూడా బాగుంది. చరిత్ర పుస్తకాల్లో పెద్దగా కనిపించని, వినిపించని మన విజయగాథను సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సంఘటన నేపథ్యంతో పాటు అప్పటి పరిస్థితులు, పరిసరాలు, సబ్ మెరైన్ లోపలి వాతవరణం.. నావల్ ఆఫీసర్‑లు వాడే భాష లాంటి విషయాల్లో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు సినిమా రేంజ్ ని పెంచాయి.

ప్లస్ పాయింట్స్:

రానా

కేకే మీనన్

మైనస్ పాయింట్స్:

కధ మొత్తం సబ్ మెరైన్ లో ఉండడం

ఆఖరిపంచ్: ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఇండియన్ నావీ సక్సెస్ స్టోరీ