మీకు తెలుసా..ఈ తేలు చరిత్ర ..!

Posted December 19, 2016

giant sea Scorpions in america‘జెయింట్ సీ స్కార్పియన్’ ఇదో సముద్రపు రకం తేలు ఎప్పుడో కోట్ల ఏళ్ల క్రితం ఉండేదట శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఈ మధ్యే దీని శిలాజాలు అమెరికాలోని లోవాలో బయటపడ్డాయి.సముద్రపు తేళ్లలో అతి పురాతనమైంది ఇదే. 467 మిలియన్ ఏళ్ల క్రితం సముద్రంలో తిరుగాడేది. అంటే దాదాపు 46 కోట్ల ఏళ్లకు ముందన్నమాట. ‘జెయింట్ సీ స్కార్పియన్’గా పిలిచే ఈ తేలు ఆరడుగుల పొడవుండేది అట రాతిమీద పూర్తిగా అతుక్కుపోయిన ఈ తేలు శరీర అవశేషాల్ని నెమ్మదిగా ఒలిస్తే 150 శిలాజాలు లభించాయి. వాటిని సూక్ష్మదర్శినిలో పరిశీలించి అనేక విషయాలు తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కాళ్లకున్న వెంట్రుకల వంటి చిన్న చిన్న భాగాలు కూడా బయటపడ్డాయి. ఈ సముద్రపు తేలు అసలు పేరు ‘పెంటెకొప్‌టెరస్ డెకొరహెన్సిస్’. నీటిలో వేగంగా దూసుకెళ్లే దీని తీరును బట్టి ప్రాచీన గ్రీకు కథల్లో యుద్ధనౌక పేరు పెట్టారు

ఇక రూపం, తీరు విషయానికి వస్తే… పేద్ద తల పైన హెల్మెట్ లాంటి కవచం, పొడవైన దేహం, ఇరువైపులా ముళ్లలాంటి కొనలతో వంకర్లు తిరిగిన రకరకాల సైజుల్లో ఐదు జతల కాళ్లతో భలేగా ఉండేదట. ఈ కాళ్లనే తెడ్డుల్లా వాడుతూ చకచకా ఈదేస్తూ శత్రు జీవుల్ని పట్టి హాంఫట్ అనిపించేదిట. ఇప్పుడున్న తేలుతో పాటు పొడవైన తోకున్న హార్స్ షూ క్రాబ్ పోలికలూ ఉండేవట. కాళ్లపై ఉన్న వెంట్రుకలతో ఇది స్పర్శను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న పరిసరాల్ని పసిగడుతుండేది. మరో విశేషం ఏంటంటే? సీ స్కార్పియన్ జీవులు ఇప్పుడున్న సాలీళ్ల పూర్వీకులు..