విమానం ముందు మేకపోతు బలి!!

Posted December 21, 2016

goat killed before plane
సాధారణంగా మన దేశంలో అమ్మవార్లకు మేకపోతులను బలి ఇస్తుంటారు. బలి ఇవ్వడం ద్వారా అమ్మ శాంతిస్తుందని భక్తులు నమ్ముతారు. మరికొంత మంది వాహనాల ముందు కూడా మేకలను బలి ఇస్తారు. కానీ విమానం ముందు మేకపోతు బలివ్వడం అనేది ఎప్పుడు విని ఉండరు. ఒకవేళ అలా జరిగినా అది మనదేశంలో మాత్రమే జరగాలి. కానీ ఈ జంతు బలి జరిగింది ఎక్కడో తెలుసా… మన దాయాది దేశం పాకిస్తాన్ లో…

ప్లేన్ ముందు బలి ఇవ్వడానికి కారణాలను చూస్తే… ఈనెల 7న పీఐఏకు చెందిన పీకే-661 విమానం హవేలియన్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పాప్ గాయకుడు, ఇస్లామిక్ ప్రీచర్ జునైద్ జంషెద్ సహా 47 మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో విమానాలకు శాంతి చేయాలని మత పెద్దలు సూచించారట. విమానాశ్రయం రన్‌వైపైనే ఒక నల్ల మేకను బలిచ్చి ఏటీఆర్-42 విమానం బయలుదేరడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బలితంతు పూర్తికాగానే విమానం ఆకాశంలోకి ఎగిరి షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ బయలుదేరింది.

విమానానికి మేకపోతును బలి ఇచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదట. ఇన్నాళ్లూ ఈ బలి ఇవ్వడంపోవడం వల్లే ఇటీవల ప్లేన్ కుప్పకూలిందంటున్నారు అక్కడి జనం. అయితే ఈ బలి ఘటనపై పాక్ అధికారులు ఆచితూచి స్పందించారు మేక బలి వ్యవహారం మేనేజ్‌మెంట్ స్థాయి కాదని అధికారులు వివరణ ఇచ్చారు.