బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్…

Posted December 15, 2016

god news to bank customersపెద్ద నోట్ల రద్దుతో సతమతమవుతున్న ప్రజానీకానికి కొద్ది రోజుల్లో ఉపశమనం లభించనుంది. నగదు విత్‌ డ్రాపై ఉన్న ఆంక్షలను త్వరలో సడలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 80శాతం కొత్త కరెన్సీ బ్యాంకులకు వచ్చిన వెంటనే నిబంధనలు సడలించనున్నట్లు తెలుస్తోంది.

రీమనీటైజేషన్‌ పూర్తి కాగానే సహకార బ్యాంకులపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లలో 50శాతం కొత్త కరెన్సీనే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం వీలయినంత త్వరలోనే ఆంక్షలు తగ్గిస్తే ప్రజలకు ఊరట కలిగే అవకాశం ఉంది.