రూపాయికి బంగారం వస్తుందా..?

0
123

Posted April 28, 2017 at 10:31

gold paytm scheme for customersపది గ్రాముల గోల్డు ధఱ ముప్ఫై వేలు పలుకుతోంది. త్వరలో మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అలాంటిది రూపాయికే ఎలా గోల్డ్ కొంటారని ప్రశ్నలు రావడం సహజమే. కానీ పేటీఎం మాత్రం తన వినియోగదారులకు సరికొత్త స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. అక్షయ తృతీయను దృష్టిలో పెట్టుకుని డిజిటల్ గోల్డ్ పేరుతో ఆఫర్ ఇచ్చింది. 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయడమే కాదు.. కావాలనుకుంటే మళ్లీ ఆన్ లైన్లో అమ్ముకునే సదుపాయం కూడా కల్పించింది.

డిజిటల్ గోల్డ్ అంటే మనకు కనిపించదుగా అంటారా. అదేం లేదండీ టచ్ చేసి చూడాల్సిందే అనుకునే వారి కోసం బంగారు నాణాలను ఇంటికి కూడా తీసికొచ్చి ఇస్తామని పేటీఎం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ ప్రకటిస్తేనే.. మన జనాలకు ఆనలేదు. ఇక పేటీఎం ఆఫర్లు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాల్సిందే. సహజంగా భారతీయులు సంప్రదాయ పద్ధతుల్లో బంగారం కొనుగోలు చేస్తారు. మార్కెట్ అనుసంధాన ధరలతో వినియోగదారులపై భారం తప్పదంటోంది పేటీఎం.

ఇంకా సమయం, స్వచ్ఛత కోసం కూడా ఛార్జీలు ఉంటాయని, అదే డిజిటల్ గోల్డ్ పేటీఎం గోల్డ్ కేవలం బంగారం ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ఊరిస్తోంది. మొదట్లో నగదు బదిలీ కూడా ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఉపసంహరించుకున్న పేటీఎం.. గోల్డ్ స్కీమ్ విషయంలో కూడా చేతులెత్తేస్తుందనే అనుమానాలున్నాయి. పైగా పేటీఎం లాభాల్లో కూడా లేదని చెబుతున్నారు. అలాంటిది గోల్డ్ స్కీమ్ ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ప్రస్తుతానికి లేదు.