బంగారం 10 గ్రాములు 26 వేలు..?

Posted December 3, 2016

 

పది గ్రాముల బంగారం రూ.26 వేలే అట..ప్రస్తుతం బులియన్ మార్కెట్ వర్గాల టాక్. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలను వివరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఒక్కొక్కరి వద్ద ఎంత బంగారం ఉండాలనే ప్రకటన. అయితే, రెండోది, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనా. మూడోది, బంగారం దిగుమతులపై చైనా ఆంక్షలు విధించడం

రాబోయే రోజుల్లో మరింత ధర తగ్గతుందని అంచనా వేస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారంపై పెట్టుబడులు అంత శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే బంగారానికి డిమాండ్‌ భారీగా పెరిగింది. మొదటి తొమ్మిది రోజుల్లోనే రూ.140 కోట్ల విలువైన 60-65 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. తర్వాత బంగారానికి డిమాండ్‌ పడిపోయింది. పెద్ద నోట్లరద్దు, బంగారంపైనా ప్రభుత్వం కన్నేసిందన్న ప్రచారంతో డిమాండ్‌ దారుణంగా పడిపోయింది. ఓడలు బళ్ళు అవడం అంటే ఇదే కావొచ్చు ..