మహానటి గురించి గుడ్‌ న్యూస్‌

0
86

Posted April 22, 2017 at 17:32

good news about savithri movie
తెలుగు వారి ఎవర్‌గ్రీన్‌ ఫేవరేట్‌ నటి సావిత్రి జీవిత కథాంశంతో నాగ్‌ అశ్విన్‌ ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా ఎంతో రీసెర్చ్‌ చేసి, సావిత్రి గురించి క్షుణంగా అద్యయనం చేసిన నాగ్‌ అశ్విన్‌ ప్రస్తుతం నటీ నటుల ఎంపికలో ఉన్నాడు. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నటీ నటుల పక్రియ కూడా దాదాపుగా ఒక ముగింపు దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

సినిమా చేయబోతున్నట్లుగా రెండు సంవత్సరాల క్రితమే వార్తలు వచ్చాయి. ఇక మూడు నాలుగు నెలల ముందు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను నాగ్‌ అశ్విన్‌ మరియు ప్రియాంక దత్‌ు ప్రకటించారు. ఇక రెగ్యులర్‌ షూటింగ్‌ను మే 10 నుండి ప్రారంభించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా చెప్పుకొచ్చారు. అశ్వినీదత్‌ కూతురు ప్రియాంక దత్‌ ఈ సినిమాను నిర్మిచబోతున్నారు. మహానటి టైటిల్‌ రోల్‌లో కీర్తి సురేష్‌ నటిస్తుండగా, జర్నలిస్ట్‌ పాత్రలో సమంత నటించనుంది. ఇక ఇదే సినిమాలో అనుష్క, ప్రకాష్‌ రాజ్‌లు కూడా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.