గౌతమీ పుత్ర శాతకర్ణి చిన్న సినిమానా?

0
138

 Posted November 1, 2016gowthami putra satakarni movie graphics high quality
బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలు ఒక్కోటిగా బయటికి వస్తున్నాయి. అయితే గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని యూనిట్ ముఖ్యుడు ఒకరు స్పష్టం చేశారు. శాతకర్ణి విమర్శకులు అనుకునే చిన్న సినిమా కాదని మరో రకంగా మాత్రం చిన్న సినిమా కావొచ్చని అయన చెప్పారు.చారిత్రక సినిమా కావడంతో నిడివి మరీ పెరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సినిమా నిడివి రెండున్నర గంటలకి మించకుండా స్క్రిప్ట్ దశలోనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.యుద్ధ సన్నివేశాలు నిడివి కాస్త ఎక్కువైనా సమయం,సందర్భం ,భావోద్వేగం కలగలిసి అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటుందని సినిమా యూనిట్ చెప్తోంది.అదండీ శాతకర్ణి చిన్న సినిమా రహస్యం.

[wpdevart_youtube]ouXn5CK0wTU[/wpdevart_youtube]