నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే “జ్వాల” పుట్టించే దాన్ని ..

Posted November 19, 2016

gupta jwala comment on pullela gopichand and pv sindhu
రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధు గురించి, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ గురించి ప్లేయర్ జ్వాల ఒక కామెంట్ చేసింది సింధుకు, సానియాకు దొరికిన సపోర్ట్‌ తనకు దక్కలేదట..

‘ఇప్పటి వరకు తాను  ప్రభుత్వాన్ని డబ్బులు అడగలేదు. ఎలాంటి అవార్డులనూ ఆశించలేదు. మొన్న సింధు ఒలింపిక్‌ పతకం గెలిచాక ‘వాళ్ల కుటుంబం అంత కష్టపడింది. వాళ్ల నాన్నగారు ఎన్నో త్యాగాలు చేశారు’ అంటున్నారు. సింధు వాళ్ల కుటుంబం కష్టపడింది. అందులో డౌట్‌ లేదు. అయితే ఓ క్రీడాకారుడి కుటుంబ సభ్యులు ఎవరైనా అంతే కష్టపడతారు. కానీ సింధుకి దొరికిన సపోర్ట్‌ నాకెక్కడిది. సానియాకు కూడా సపోర్ట్‌ దొరికింది. ఇలాంటివి మాట్లాడకూడదు. నేను ఫేమస్‌ అయ్యానంటే అది కేవలం నా ఆటతోనే. నాకెవరూ సపోర్ట్‌ చేయలేద’ని చెప్పుకొచ్చింది జ్వాల. కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ డబుల్స్‌ను సపోర్ట్‌ చేయరని, అంతే తప్ప అతనితో తనకెలాంటి ఇబ్బందులూ లేవని ఛాన్స్ ఇచ్చి ఉంటె తాను కూడా ప్రూవ్ చేసుకుంటా అంటోంది ..