గువ్వ గోరింక ఫస్ట్ లుక్

0
77

Posted February 11, 2017

guvva gorinka movie first lookజ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మితో కలిసి నటించిన సత్యదేవ్ గుర్తున్నాడు కదూ. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యదేవ్ తాజగా నటిస్తున్నచిత్రం గువ్వ గోరింక. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని ఈ  సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ సినిమాలో ప్రియాలాల్ హీరోయిన్ గా నటిస్తోంది. విభిన్న కధగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రయూనిట్.

విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల కధే గువ్వ గోరింక సినిమా అని నిర్మాత తెలిపారు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా  టీజర్ ను లవర్స్ డే ఫిబ్రవరి14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరి రామ్ గోపాల్ వర్మ్ శిష్యుడు గువ్వ గోరింకని ఎలా చూపిస్తాడో చూడాలి.