మంత్రి హరీష్ రావు కక్ష సాధిస్తున్నారా..?

Posted December 17, 2016

harish rao rivalry on opposition party in assembly meetingsమంత్రి హరీష్ రావు కక్ష సాధిస్తున్నారా? అవును కక్ష సాధిస్తున్నారనే అనిపిస్తోంది…తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఐన ఐదు నిమిషాల్లోనే విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేయాలనే తీర్మానం ప్రవేశ పెట్టి సభ లో ఎదురు లేకుండా చేసుకొన్నారు..విపక్ష సభ్యులు మాత్రం తమ పట్ల స్పీకర్ పక్ష పాత ధోరణితో ఉంటున్నారని అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానా రెడ్డి మంత్రి గా ఉన్న సమయం లో ఇదే సీన్ రిపీట్ అయ్యిందని జై తెలంగాణా అంటే చాలు సస్పెండ్ చేసిన రోజులు అనేకం ఉన్నాయని ఆరోజుల్లో జానా మౌనంగా చూస్తూ ఉన్నారని మరిప్పుడు ఆ సంగతి ఎందుకు గుర్తు లేదని మంత్రి హరీష్ రావు గుర్తు చేసారు, ఆ రోజు మీసమయం కాబట్టి మీ మాట నెగ్గాలని మమ్మల్ని బైటకి గెంటించారు ఈరోజు మేము అధికారం లో వున్నాం కనుక మా మాట నెగ్గించుకోవడం కోసం బైటికి గెంటిస్తాం అనేది హరీష్ మాటగా వుంది. అసలు ఈ గొడవ మొత్తం పార్టీ ఫిరాయించిన ఎమ్ఎల్ఏ సంగతి తేల్చాలని పట్టుపట్టటం..ఆ వెంటనే సభ్యుల సస్పెన్షన్ ల పర్వం జరిగింది….మంత్రి హరీష్ కి కక్ష సాధించే ఛాన్స్ కూడా వచ్చినట్టైంది…