దర్శకుడి అవతారమెత్తనున్న హర్షవర్థన్..

Posted February 8, 2017

harshavardhan to become director 

అమృతం సీరియల్లో అమృతరావుగా నటించి బుల్లితెరపై చాలా పాపులర్ అయిపోయాడు హర్షవర్ధన్. ఆ తర్వాత అతడు, అనుకోకుండా ఒకరోజు, లీడర్ వంటి సినిమాల్లో  పెర్ఫామెన్స్ ఉన్న రోల్స్ లో నటించి వెండితెరపై కూడా  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానేకాకుండా ఇష్క్, గుండెజారిగల్లంతయ్యిందే, మనం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి రచయితగా కూడా పనిచేశారు. అయితే ఈ రచయిత ఇప్పుడు దర్శకడిగా కూడా మారనున్నాడట.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వేదాళం రీమేక్ కి డైలాగ్స్ రాసే అవకాశం వచ్చినా నో చెప్పాడట. జస్ట్ ఎల్లో నిర్మాణ సంస్ధలో కొత్త హీరోహీరోయిన్లతో తెరకెక్కబోయే సినిమాకు హర్షవర్థన్ దర్వకత్వం వహించనున్నాడని, ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. మరి నటుడిగా, రచయితగా హిట్స్ అందుకున్న హర్షవర్థన్.. దర్శకుడిగా ఎలాంటి సినిమాను తీయనున్నాడో చూడాలి.