వక్షోజాల్లో నొప్పి … ఎందుకో తెలుసా ..!

0
168

Posted December 7, 2016

health tips of ladies breast pain problems
‘రొమ్ములో నొప్పిగా ఉంటోందా ..! భయపడకండి ఇది చదివి తెలుసుకోండి.

వక్షోజాల(రొమ్ములు) నుంచి . ”అప్పుడప్పుడూ స్రావాలూ విడుదలవుతున్నాయి..” ”తడుముతుంటే గడ్డల్లా తగులుతున్నాయి” అంటూ ఏదో జబ్బు వచ్చిందని భయపడుతుంటారు కానీ అందులో ఎంతవరకు నిజం ఉందొ నిర్ధారించుకోవాలి ..

**పుట్టినప్పట్నుంచే స్త్రీల వక్షోజాల్లో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొన్ని సమస్యలూ ఎదురవుతాయి. సాధారణంగా రొమ్ములో నొప్పీ, అసాధారణ స్రావాలూ, గడ్డలూ, ఆకృతిలో తేడాల వంటి సమస్యల్ని చాలామంది ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. పైగా అవి పుట్టిన పాపాయి దగ్గర్నుంచీ, రుతుక్రమం మొదలైనప్పుడూ, యౌవనంలో, గర్భిణిగా ఉన్నప్పుడూ, బిడ్డకు పాలిచ్చేప్పుడూ, నడివయసు నుంచి మెనోపాజ్‌ వరకూ… ఇలా ఏ దశలోనయినా ఇబ్బందిపెట్టవచ్చు

**** వక్షోజాల నిర్మాణం

==రొమ్ముల్లో అతి ముఖ్యమైన భాగం పాల గ్రంథి అయినప్పటికీ ఇతర కణజాలం కూడా ఉంటుంది. చర్మం, కొవ్వు పదార్థం, మందమైన టిష్యూ పొర (ఫేసియా), కండరాలూ, పక్కటెముకలూ, చనుమొనల వంటివన్నీ వాటి నిర్మాణంలో భాగమే. ఇవన్నీ ఒక్కో వయసులో ఒక్కోరకమైన మార్పు చెందుతూ వస్తాయి. పాల గ్రంథులైతే హార్మోన్లకి ఎక్కువగా స్పందిస్తాయి.

***నొప్పి ఎందుకంటే…

===ప్రతి స్త్రీకి ఏదో ఒక వయసులో ఈ బాధ ఉంటుంది. చాలామంది ఈ నొప్పి క్యాన్సర్‌కి సంకేతం అని భయపడతారు. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సైక్లికల్‌. అంటే రుతుచక్రంతో ప్రతినెలా వచ్చే నొప్పి. ఇది నెల మధ్యలో మొదలై నెలసరి సమయం వరకూ పెరుగుతూ ఉంటుంది. హార్మోన్లు ఎక్కువగా స్రవించడం వల్ల వక్షోజాల్లోని కణాల్లో స్రావాలు ఎక్కువై, నొప్పి వస్తుంది. వక్షోజాలు కాస్త గట్టిగా అనిపిస్తాయి

===నొప్పి నివారణ మందులు, విటమిన్‌ ఇ, ఈవెనింగ్‌ ప్రిమ్‌రోజ్‌ మాత్రల రూపంలో తీసుకోవడం, వక్షోజాలకు ఆసరా ఉండే లోదుస్తులు ధరిస్తే మంచిది .

=== నెలసరికి కొన్ని రోజుల ముందు కాఫీలూ, టీలూ, శీతలపానీయాలూ, వేపుళ్లూ తగ్గించుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. అయినా ఫలితం లేదనుకుంటే సమస్య తీవ్రతను బట్టి మూత్రవిసర్జన ఎక్కువ కావడానికి మందులు డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం బెటర్

==. కొన్నిసార్లు రుతుక్రమంతో సంబంధం లేకుండా కూడా నొప్పి ఉంటుంది. రొమ్ములో స్రావాలు నిలిచిపోయి, చిన్నచిన్న నీటి బుడగల్లా తయారైనా, లేదా రొమ్ములోని పాల నాళాల్లో స్రావాలు గట్టిపడినా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిని ఫైబ్రోసిస్టిక్‌ డిసీజ్‌ అంటారు.

****చనుమొనల నుంచి స్రావాలు…

==ఒక్కోసారి హార్మోన్ల ప్రభావం వల్ల చనుమొనల నుంచి నీరులాంటి స్రావం కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది చిక్కగా, నెత్తురులా ఉండటం, బూడిద రంగులో, చీములా ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.

==గెలక్టోరియా: అంటే వక్షోజాల నుంచి పాలు స్రవించడం, పాలిచ్చేప్పుడు కాకుండా ఇతర సమయాల్లోనూ ఇలా స్రవిస్తుంటే దీనికి కొన్ని కారణాలుంటాయి. మొదటిది ప్రొలాక్టిన్‌ లేదా పాల హార్మోను ఎక్కువగా తయారుకావడం. ఇది మెదడులో ట్యూమర్లతో, లేదా మూత్రపిండాల వైఫల్యం, లేదా కొన్నిరకాల మందులు వాడటం వల్ల కావచ్చు. ఒత్తిడి నివారణకు సంబంధించిన మందులు వాడటం వల్లా కావచ్చు. ఫలితంగా ప్రొలాక్టిన్‌ స్థాయులు పెరుగుతాయి.

== ప్రొలాక్టిన్‌, థైరాయిడ్‌, ట్యూమర్‌ లేదని నిర్ధరించుకోవడానికి మెదడుకి సీటీస్కాన్‌ లాంటి పరీక్షలు అవసరం.

***వక్షోజాల్లో గడ్డలు…

=== రొమ్ము తడిమితే చేతికి గడ్డలు తగులుతున్నాయని చెబుతుంటారు చాలామంది. చాలామంది పాలగ్రంథినే గడ్డ అనుకుని కంగారుపడతారు.

===రొమ్మును పరీక్షించడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. రెండువేళ్ల మధ్య వక్షోజాలను పట్టుకుని చూస్తే గడ్డల్లానే ఉంటాయి. అలా కాకుండా అరచేత్తో తడిమి, పరీక్షించుకుంటే నిజంగానే గడ్డలు ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఆ సందేహం ఉంటే గనుక వైద్యులు మామోగ్రఫీ సూచిస్తారు.

===సాధారణంగా చిన్నవయసులో చేతికి తగిలే గడ్డలు ఫైబ్రోఎడినోమా కావచ్చు. అవి తేలిగ్గా రొమ్ములో తగులుతాయి. చనుమొనల నుంచి ఎలాంటి స్రావాలూ విడుదలకావు. పెద్దగా ఉండి, వాటితో సమస్యలొస్తుంటే తప్ప చికిత్స అవసరంలేదు

=== కొన్నిసార్లు వక్షోజాల్లోని కొవ్వంతా గడ్డకట్టి కూడా గడ్డలా తయారవుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు కూడా గడ్డలా చేతికి తగులుతుంది. అప్పుడు మాత్రం జ్వరం, గడ్డ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

=== ఒకవేళ ఆ గడ్డ గట్టిగా రాయిలా వక్షోజం లోపల అతుక్కుని ఉంటే పైన చర్మం కూడా దానికి అతుక్కుపోయి, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావాలూ వస్తుంటే క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.

==ప్రతినెలా నెలసరి అయిపోయిన వెంటనే వక్షోజాలను పరీక్షించి చూసుకోవాలి. ఏడాదికోసారి వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో రొమ్ముక్యాన్సర్‌ ఉన్న స్త్రీలు ముప్ఫైఅయిదు సంవత్సరాల నుంచి, ఇతరులు నలభై ఏళ్ల నుంచి ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి.