అతనితో ఎఫైర్ పెట్టుకుంటా..!

Posted November 16, 2016

Hebha Patel Ready To Date With Raj Tarunకుమారి 21f తో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన హెబ్భా పటేల్ ఆ తర్వాత కూడా హీరో రాజ్ తరుణ్ తోనే ఈడోరకం ఆడోరంతో హిట్ అందుకుంది. హిట్ అండ్ హాట్ పెయిర్ గా క్రేజ్ సంపాదించిన ఈ ఇద్దరితో సినిమా చేయాలని దర్శకులు చూస్తున్నారు. ప్రస్తుతం కుర్ర హీరో నిఖిల్ సరసన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో నటించిన హెబ్భా ఈ సినిమా ప్రమోషన్స్ లో అందరు షాక్ అయ్యే కామెంట్స్ చేసింది. నిఖిల్, రాజ్ తరుణ్ లలో ఎవరితో డేట్ కి వెళ్తారు అన్న రాపిడ్ ఫైర్ ప్రశ్న ఆమెకు ఎదురవగా సెకన్ కూడా లేట్ చేయకుండా రాజ్ తరుణ్ అనేసింది.

కుమారి 21f, ఈడోరకం ఆడోరకంలో కలిసి నటించినా మళ్లీ రాజ్ తరుణ్ నే కోరుకుంటుంది ఈ హాట్ బ్యూటీ. రాజ్ తో డేట్ కు నేను రెడీ అంటూ ఓపెన్ గా చెప్పేస్తుంది. ఇప్పటికే ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్న మాటలకు హెబ్భా ఇంకా బలం చేకూరేట్టు చేస్తుంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అవడంతో కెరియర్ మీద కాస్త నమ్మకం పెంచుకున్న అమ్మడు ఇలాంటి హాట్ కామెంట్స్ తో ఆడియెన్స్ కు మరింత దగ్గరవ్వాలని చూస్తుంది.

మరి రాజ్ తరుణ్ తో ఎఫైర్ కు నేను రెడీ అని హెబ్భా అంటున్నా అందుకు రాజ్ ఒప్పుకోవాలి కదా అని అంటున్నారు. లాస్ట్ సినిమా టైంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఎడమొహం పెడ మొహంగా కనిపించారు. మరి ఇప్పుడేమో ఏకంగా అతనితో డేటింగ్ కు రెడీ అంటుంది. వారి మధ్య ఏం జరుగుతుందో వారికే తెలియాలి.