ఎన్టీఆర్ గురించి శ్రీకాంత్ చెప్పిన నిజమేంటి.?

0
126

Posted September 29, 2016

 hero srikanth appreciated ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి శ్రీకాంత్ అభిప్రాయమేమిటో తాజా ఇంటర్వ్యూ లో తెలిసింది. కుటుంబం అండ లేకుండా కూడా స్టార్ గా ఎదగొచ్చని ఎన్టీఆర్ నిరూపించాడని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. కొడుకు రోషన్ భవిష్యత్ మీద కామెంట్ చేస్తూ ఎన్టీఆర్ ని కోట్ చేశారు శ్రీకాంత్. అలాగే తన కొడుకు రోషన్ కూడా రావాలని శ్రీకాంత్ అభిలాషించాడు.

ఇదే శ్రీకాంత్ సింహాద్రి విడుదల సమయం లో తారక్ దూకుడుగా మాట్లాడాడని.. చిరంజీవిని గుర్తించనట్టే వ్యాఖ్యానించాడని బాధపడ్డాడు .. ఓ టీవీ లైవ్ షో లో ఇదే విషయం మీద తారక్ వ్యవహార శైలి మీద అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఇప్పుడు తారక్ లో మార్పును చూశాడో లేక ఎన్టీఆర్ వెనుకున్న కష్టాన్ని అర్ధం చేసుకోన్నాడోగానీ ఎన్టీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. ఒకప్పుడు చిరు క్యాంప్ లో కీలక సభ్యుడైన శ్రీకాంత్ లో ఈ మార్పు ఎందుకు వచ్చిందో.?