టాప్ చెయిర్ పై కన్నేసిందా..?

Posted November 21, 2016

Heroine eyes on top chair in tollywoodటాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా ఆదరిస్తారు. హీరోయిన్స్ కొరత బాగా కనబడే టాలీవుడ్ లో ఉన్న వారితోనే మళ్లీ మళ్లీ కలిసి నటిస్తారు హీరోలు ఈ టైంలో ఎవరన్నా హీరోయిన్ అందంతో అభినయంతో ఆకట్టుకుంటే చాలు ఆమె కోసం అవకాశాలను ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఆ క్రేజ్ తోనే వరుస అవకాశాలను అందుకుంటుంది నేను శైలజ బ్యూటీ కీర్తి సురేష్. మలయాళంలో ఆల్రెడీ ఫాంలో ఉన్న ఈమె తెలుగులో రామ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత కోలీవుడ్ బాట పట్టిన అమ్మడు ప్రస్తుతం తెలుగులో నేను లోకల్ సినిమా చేస్తుంది.

నాచురల్ బ్యూటీగా కనిపించే కీర్తి పవర్ స్టార్ త్రివిక్రం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అంతేనా మహేష్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమాకు ఆమె కన్ఫాం అని అంటున్నారు. సో ఈ లెక్కన చూస్తుంటే సమంత, కాజల్, తమన్నలు కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించే సరికి ఉన్న రకుల్ కు పోటీగా కీర్తి తన టాలెంట్ తో ఛాన్సులు పట్టేస్తుంది. మరి ఇదే రేంజ్లో స్టార్స్ అందరితో సినిమాలు తీస్తే టాలీవుడ్ టాప్ చెయిర్ సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురు అయిన కీర్తి సురేష్ తనకు తెలుగు భాష మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తుంది. తన మదర్ ఒక్క సినిమాతో టాలీవుడ్లో ఫుల్ స్టాప్ పెట్టినా కీర్తి మాత్రం ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. మరి అమ్మడి లక్ ఎలా ఉండబోతుందో చూడాలి.