హీరోయిన్‌కు క్యాన్సర్‌..!

0
30

Posted April 19, 2017

heroine Krishnakumari Suffer with bone Cancer and Admitted in Hospital
ఇప్పటి వరకు ఎంతో మంది సినీ ప్రముఖులు క్యాన్సర్‌ కారణంగా చనిపోవడం మనం చూశాం. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో నటీ నటులు క్యాన్సర్‌ బారిన పడి చనిపోయిన విషయం తెల్సిందే. అదే జాబితాలో మరో హీరోయిన్‌ క్యాన్సర్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలుగులో ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాల్లో నటించిన కృష్ణ కుమారి బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు వెళ్లడి చేశారు. ప్రస్తుతం ఆమెను బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ చేసి చికిత్స చేయిస్తున్నారు. తెలుగు తొలి తరం హీరోయిన్‌గా కృష్ణ కుమారి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, శోభన్‌బాబు ఇంకా పలువురు సీనియర్స్‌కు జోడీగా కృష్ణకుమారి నటించారు. తెలుగు, తమిళం, కన్నడంలో కలిపి మొత్తంగా 185 సినిమాల్లో కృష్ణ కుమారి నటించారు. త్వరలోనే ఆమె కోలుకోవాలని ఆమె సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు, అభిమానులు కోరుకుంటున్నారు.