అదా శర్మ కష్టాలు..!

Posted November 15, 2016

Heroine Learning Telugu Speaking Languageతెలుగులో నటించే భామలు తెలుగు నేర్చుకుంటారనేది పాత విషయం.. ఇప్పటి భామలంతా తెలుగు ధారాళంగా మాట్లాడగలుగుతున్నరు.. అయితే హింది సినిమాలో నటిస్తూ తెలుగు కోసం కుస్తి పడుతుంది హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ. ఎందుకలా అంటే అమ్మడు నటిస్తున్న కమాండో-2లో ఆమె తెలుగు అమ్మాయి పాత్రలో నటిస్తుంది. సినిమాలో ఆమె ఎక్కువగా తెలుగు మాట్లాడుతుందట దాని కోసం అదా శర్మ తెలుగు నేర్చుకుంటుందట. సో తెలుగు సినిమాలు చేసేప్పుడు కూడా తెలుగు కోసం కష్టపడని అదా హింది సినిమా చేసేప్పుడు తెలుగు నేర్చుకుంటుందట.

అయితే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా ఉన్న చాలా మంది భామలు ఆల్రెడీ తెలుగులో మాట్లాడేస్తున్నారు. మొదటి రెండు సినిమాలకే తప్ప ఆ తర్వాత ఇక్కడ దక్కుతున్న ఆదరణను బట్టి తెలుగు నేర్చుకుని సినిమాలతో పాటు అభిమానులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు హీరోయిన్స్. అయితే అదా చేసేది అలాంటి అవసరం కోసం కాకున్నా ఓ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటుంది అమ్మడు.