స్టార్స్‌ వద్దన్నప్పుడు వారితో రొమాన్స్‌ తప్పదంటోంది

0
32

Posted April 24, 2017 at 18:19

heroine regina romance with young heroes
వరుసగా మెగా హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన రెజీనా స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని రెజీనాతో పాటు ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతుండగా, రెజీనా మాత్రం ఇంకా చిన్న హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ అమ్మడు నటిస్తూ ఉంది. ఎంత ప్రయత్నించినా కూడా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు రాక పోవడంతో చిన్న చితకా హీరోలతో సర్దుకు పోతూ ఉంది.

తాజాగా ఒక తమిళ మీడియాతో మాట్లాడిన ఈమె స్టార్‌ హీరోలతో ఛాన్స్‌ల కోసం ఎదురు చూడటం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేదాంత దోరణిలో చెప్పుకొచ్చింది. స్టార్‌ హీరోలు నన్ను వద్దన్నప్పుడు నేనెందుకు వారిని పట్టుకుని బతిమిలాడాలి, కొత్త హీరోలు, చిన్న హీరోలతో చేసేందుకు నాకేం ఇబ్బంది లేదు, నా అవసరం ఉందని భావించిన వారితో తాను నటిస్తానంటూ ఈమె చెప్పుకొచ్చింది. స్టార్‌ హీరోలతో నటించాలనే కోరిక ఎవరికి ఉండకుండా ఉంటుంది, ప్రతి ఒక్క హీరోయిన్‌ కూడా స్టార్స్‌తో నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. కాని రెజీనా మాత్రం ఇలా మాట్లాడటం కాస్త విడ్డూరంగా ఉంది. ఇవి లోపల నుండి వచ్చిన మాటలా లేక పైపై మాటలా అనేది ఆమెకే తెలియాలి.