కారులో సైకిల్ కుదరదు..హైకోర్ట్

  high court warning telangana  jumping mla's
ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన తెరాస కి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. తెరాస లో టీడీఎల్పీ విలీనం చెల్లదని పరోక్ష తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపులకు  సంబంధించి టీడీపీ సాగిస్తున్న న్యాయపోరాటం ఫలించింది.స్పీకర్ దగ్గర 12 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ లు విచారణ పెండింగ్ లో ఉండగానే విలీన నిర్ణయం ఎలా చేస్తారని దేశం తరపు న్యాయవాది కోర్ట్ లో వాదించారు.దాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్ట్ విలీనం చెల్లదని చెప్పింది.మూడు నెలల్లో అనర్హత పిటీషన్ లపై విచారణ పూర్తి చేయాలని స్పీకర్ కి హైకోర్ట్ సూచించింది.

తీర్పు వెలువడ్డవెంటనే రేవంత్ రెడ్డి …కెసిఆర్ కి హైకోర్ట్ గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించారు.చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి ,ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా వ్యవహరించాలని హితవు చెప్పారు.స్పీకర్ వ్యవహారశైలి కూడా మారాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.