కాలాన్ని బట్టి ఆరోగ్యం కాపాడుకోవటం ఎలా..? పార్ట్-2

  how care health changing every season

హేమంత ఋతువు(నవంబర్, డిసెంబర్):

హేమంత ఋతువులో వ్యక్తుల స్వభావాల్ని బట్టి ఆహారపు అలవాట్లు ఉండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

 1. వాత తత్వం గలవారు ఈ కాలంలో శరీరానికి వేడి కలిగించే పదార్థాలు తీసుకోవాలి.
 2. వాత తత్వం ఉన్న వారికి నూనె పదార్థాలు, తీపి, పులుపు, ఉప్పు రుచులున్న ఆహారం ఈ కాలంలో మంచి చేస్తుంది.

3  వాత తత్వం ఉన్న వాళ్ళు ఈ కాలంలో చన్నీటి స్నానం చేయడమే మంచిది.

 1. ఇక పిత్త తత్వం కల వారికి తీపి, చేదు, వగరు రుచి వుండే పదార్థాల్ని తీసుకోవడం మేలు చేస్తుంది.
 2. సువాసన ద్రవ్యాలు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల పిత్త తత్వం ఎక్కువ కాకుండా ఉంటుంది.
 3. వనవిహారాలు, శృంగారకార్య కలాపాలు ఈ కాలంలో పిత్తతత్వం కలవారికి మేలు చేస్తాయి.
 4. కఫ ప్రభావం ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ కాలంలో అప్పుడప్పుడూ ఉపవాసాలు చేయాలి.
 5. ఈత, వ్యాయామం లాంటివి కఫ ప్రభావ వ్యక్తులకు ఈ కాలంలో చాలా అవసరం.

ఆరోగ్యం పరంగా అతి సున్నితమైన ఋతువు ఇది. దీన్నే ఆయుర్వేద వైద్యులు బహు చమత్కారంగా చెప్పారు. ‘వైద్యస్య శారధీమాతపితాకుసుమాకర’ అంటే శరత్కాలము వైద్యులకు తల్లి అని, వసంత కాలము తండ్రి అని వీరి భావం. అంటే డాక్టర్లకు ఎక్కువ డబ్బులు, మనకు ఎక్కువ జబ్బులు వచ్చే కాలాలివే.

కారం, చేదు, వగరుగా వుండే ఆహారం కఫ ప్రభావం వున్నవారికి ఈ కాలంలో ఎంతో ఉపయోగం.

  how care health changing every season

శిశిర ఋతువు (జనవరి, ఫిబ్రవరి):

ఈ కాలంలో వాత సమస్యలతో అనారోగ్య సూచనలు ఎక్కువ.

 1. శిశిర ఋతువులో ఉదయపు ఆహారం ఎంత త్వరగా తీసుకుంటే అంత మేలు.
 2. కారం, ఉప్పు, వగరు రుచులున్న పదార్థాలను ఆహారంలో ప్రాధాన్యం ఇవ్వాలి.
 3. గోధుమ, బియ్యం, బెల్లం, మినుములు, నువ్వులతో చేసే పదార్థాలు ఈ ఋతువులో శరీరానికి చాలా అవసరం. అలాగే మాంసాహారం కూడా ఈ ఋతువులో ఆరోగ్యానికి మంచిది.
 4. శరీరంలో వేడి పుట్టించడానికి వ్యాయామం, మసాజ్ లు మేలు చేస్తాయి.

వసంత ఋతువు(మార్చి,ఏప్రిల్):

ఈ కాలంలో కఫ వ్యాధులు ప్రకోపిస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఈ ఋతువు వైద్యులకు తండ్రి లాంటిది. మనకు మాత్రం ఆరోగ్యపరంగా కఠిన పరీక్ష పెడుతుంది.

 1. ఈ కాలంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
 2. ఈ కాలంలో పగటి నిద్ర అసలు మంచిది కాదు.
 3. గోరువెచ్చని నీటితో స్నానం మంచిది.
 4. పాతబియ్యం, పాతగోధుమలతో చేసిన ఆహారం తీసుకోవాలి.
 5. చెట్లు, పుష్పాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సంచరించడం ఆరోగ్యానికి మేలు.