ధ్రువకు బాహుబలి రేంజ్ ఉందా..?

How Possible Comparisions Dhruva And Bahubali Tollywood Moviesమెగా పవర్ స్టార్ రాం చర్ణ్ నటించిన ధ్రువ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవబోతుంది. ఈ క్రమంలో నిన్న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ మంత్రి కె.టి.ఆర్, ఆంధ్యా మంత్రి గంటా శ్రీనివాస రావు చీఫ్ గెస్ట్ లుగా వచ్చిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా మెగా అభిమానుల హంగామాతో జరిగింది. ఇక కార్యక్రమంలో చరణ్ స్నేహితుడు భళ్లాలదేవ రానా దగ్గుబాటి ధ్రువ సినిమాను బాహుబలి రేంజ్ హిట్ అవ్వాలని అన్నారు.

Image result for dhruva

రాం చరణ్ తాను చిన్ననాటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ మని చెప్పిన రానా అల్లు అరవింద్ గారంటే భయమని మేము చేసే పనులు మా పేరెంట్స్ చెబుతారని ఆయనంటే భయమని అన్నారు. ఇక ఈ గ్రౌండ్ తో మాకు చాలా అనుబంధం ఉంది.. మేము పెద్దగా చదువుకోలేదు కాని అప్పట్లో ఈ గ్రౌండ్ లోనే ఆడుకునేవాళ్లం అన్నట్టు చెప్పాడు రానా. ధ్రువ హిట్ అవాలి అన్న మాట వరకు ఓకే కాని బాహుబలి రేంజ్ హిట్ అవ్వాలని అనడం కాస్త ఇబ్బందిగా ఉంది.

Related image

తెలుగు సినిమా చరిత్రలోనే కాదు భారత సిని చరిత్రలోనే ఓ ప్రభజనం సృష్టించిన రాజమౌళి బాహుబలి ధ్రువ సినిమాను పోల్చడం కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నా రాం చరణ్ కెరియర్ లో ధ్రువ ఆ రేంజ్ హిట్ ఆవాలనే ఉద్దేశంతో రానా అలా మాట్లాడి ఉంటాడని సర్ధి చెబుతున్నారు. మరి ధ్రువ రేంజ్ ఏంటో తెలుసుకోవాలంటే మరో 4 రోజులు ఆగితే సరిపోతుంది.