కొండా తవ్వినా ఎలుక దొరక లేదు.హ్రితిక్ ,కంగనా వివాదం..

Posted November 17, 2016

hrithik roshan and kangana ranaut legal case closedబాలీవుడ్ తారలు హ్రితిక్ ,కంగనా రౌనత్ ల గొడవ కు క్లైమాక్స్ పడనుంది. అతిపెద్ద వివాదం గా  మారిన వీరి వివాదం ను పోలీస్ లు మూసివేయనున్నారు. వ్యవహారంలో ఎవరి తప్పుందో తేల్చడంలో ముంబై పోలీసులు విఫలమయ్యారు. ఫోరెన్సిక్‌ విభాగం కూడా ‘నిల్‌ రిపోర్టు’ ఇవ్వడంతో హృతిక్‌-కంగన గొడవ వ్యవహారానికి పోలీసులు ముగింపు పలకనున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ లోని సైబర్‌ పోలీసులు ఎటువంటి నిర్థారణకు రాలేకపోయారు.

hroshan@email.com మెయిల్‌ ఐడీకి సంబంధించి వివరాలు సంపాదించలేకపోయామని క్రైమ్‌బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌ సంజయ్‌ సక్సేనా తెలిపారు. అమెరికాలోని సర్వర్‌ నుంచి ఈ మెయిల్‌ ఐడీ వాడినట్టు కనుగొన్నామన్నారు. అయితే దీన్ని ఎవరు వాడారనే విషయం కనిపెట్టలేకపోయామని, తమకు దొరికిన సాక్ష్యాలు ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు

అమెరికా సర్వర్‌ లోని సమాచారం దొరికితేనే వివాదాస్పద ఈ-మెయిల్‌ ఎవరు వినియోగించారనే విషయం తెలుస్తుందని, కానీ ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని మరో సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. దర్యాప్తు ఫలితం తమకు ఆశ్చర్యం కలిగించలేదని కంగనా రౌనత్‌ తరపు లాయర్‌ రిజ్వాన్‌ సిద్ధిఖీ అన్నారు. కంగనా ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేసారు .