విడాకులు తీసుకున్నాక మళ్లీ ఇదేంటో..!

0
104

Posted May 19, 2017 at 17:31

hrithik roshan buy apartment to ex wife suhana
బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మరియు ఆయన భార్య సుసానే ఖాన్‌ కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి అయినప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారిద్దరి మద్యలో ఒక పార్టీలో తలెత్తిన విభేదాల కారణంగా చివరకు వారు విడాకులు తీసుకునే వరకు వెళ్లారు. ప్రస్తుతం వారిద్దరు మాజీ భార్య భర్తలు. ఈ సమయంలోనే హృతిక్‌ రోషన్‌ మరో హీరోయిన్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడని, ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికి కూడా తన మాజీ భార్యపై హృతిక్‌కు ప్రేమ తగ్గలేదని తాజా సంఘటనతో వెళ్లడైంది.

విడాకులు తీసుకున్నాక మామూలుగా అయితే ఒకరి మొహం ఒకరు చూసుకునేందుకు కూడా ఇష్టపడరు. కాని వీరిద్దరు మాత్రం పిల్లల కోసం వారం వారం కలుస్తూనే ఉంటారు. సమయం దొరికినప్పుడు పిల్లలతో కలిసి వీరిద్దరు విహార యాత్రలకు వెళ్తూ ఉంటారు. తాజాగా మాజీ భార్య కోసం హృతిక్‌ రోషన్‌ ఏకంగా 25 కోట్లు పెట్టి ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం హృతిక్‌ ఇంటికి కూత వేటు దూరంలోనే ఆమెకు ఇల్లు కొనిచ్చాడటంటూ బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తన పిల్లల కోసం ఆ ఫ్లాట్‌ కొన్నాను అంటూ హృతిక్‌ చెబుతున్నాడు. అయితే పిల్లలతో పాటు ఆమె కూడా ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఉండనుంది. విడాకులు అయిన తర్వాత వీరిద్దరు ఇంత అన్యోన్యంగా ఉండటం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.