మెగాస్టార్ ను హృతిక్ రోషన్ కూడా వాడేశాడుగా..!

Posted December 21, 2016

Hrithik Roshan Used Megastar Mania for His Kaabil Movie

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ టైంలో అందరు ఆయన జపం చేసేస్తున్నారు. అయితే ఇది తనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది చెప్పలేం కాని మెగాస్టార్ వాడకం టాలీవుడ్లో హాట్ న్యూస్ అయ్యింది. ఇంతకీ ఏంటి ఈ మ్యాటర్ అంటే.. మెగాస్టార్ చిరంజీవిని వాడుకుంటూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు బాలీవుడ్ హీరోలు. రీసెంట్ గా దంగల్ ప్రమోషన్స్ కు వచ్చిన ఆమిర్ ఖాన్ చిరు, పవన్ లతో నటించేందుకు రెడీ అన్నాడు. ఇప్పుడు మెగాస్టార్ ను వాడేస్తునాడు హృతిక్ రోషన్.

హృతిక్ యామి గౌతం జంటగా నటించిన కాబిల్ సినిమా తెలుగులో బలం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఓ హింది సినిమా తెలుగు ట్రైలర్ కు ఇంత హడావిడి ఎందుకు అని అనుకోవచ్చు కాని ఇక్కడ ట్రైలర్ లో మెగాస్టార్ ప్రస్థావన తీసుకురావడం విశేషం. ఓ సన్నివేశంలో నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను అంటూ వచ్చే చిరు వాయిస్ నిజంగా ఫ్యాన్స్ కు భలే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ఇద్దరు బ్లైండ్ క్యారక్టర్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో హృతిక్ నటన అందరిని ఆకట్టుకుంటుంది. ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

తెలుగు సినిమాలేమో బాలీవుడ్ మార్కెట్ మీద కన్నేయగా ఇప్పుడు వారు కూడా ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దంగల్ మూవీ తెలుగులో భారీగానే ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. మరి మెగాస్టార్ వాడకం హృతిక్ ఏమాత్రం బలం ఇస్తుందో చూడాలి.