యామీని నలిపేసిన హృతిక్

Posted January 20, 2017

hruthik moulded yami
అవును… హీరోయిన్ యామీ గౌత‌మ్ ను బాలీవుడ్ అంద‌గాడు హృతిక్ రోష‌న్ నలిపేశాడ‌ట‌.. స్వ‌యంగా యామీనే ఇలా చెప్పుకొచ్చింది. అదేంటి అని ఆశ్చ‌ర్య‌పోకండి.. ముందు ఆ డీటైల్స్ అన్నీ తెలుసుకోండి!!

ప్ర‌స్తుతం యామీ బాలీవుడ్ లో బిజీబిజీగా ఉంది. రాంగోపాల్ వ‌ర్మ సినిమా స‌ర్కార్-3, హృతిక్ రోష‌న్ సినిమా కాబిల్ లో న‌టిస్తోంది. రెండు పెద్ద ప్రాజెక్టులే కావ‌డంతో అమ్మ‌డు ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా కాబిల్ సినిమాలో అంధురాలిగా న‌టిస్తోంది. అటు హృతిక్ కూడా ఇందులో అంధుడిగా నటిస్తున్నాడు. పెర్ఫామెన్స్ కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్ కావ‌డంతో … ఈ సినిమాతో లైఫ్ ట‌ర్న్ అయిపోతుంద‌ని యామీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు హృతిక్ నామ‌స్మ‌ర‌ణ చేస్తోంది.

కాబిల్ సినిమా షూటింగ్ లో హృతిక్ త‌న‌కు ఫుల్ స‌పోర్ట్ గా ఉన్నాడ‌ట‌. అత‌ని హార్డ్ వ‌ర్క్ చేసి చాలా నేర్చుకుంద‌ట ఈ అందాల ముద్దుగుమ్మ‌. హృతిక్ చేతుల్లో న‌లిగిన త‌ర్వాత త‌నలోని బెస్ట్ టాలెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని యామీ చెబుతోంది. హృతిక్ త‌న‌లోని ఫెర్మామెన్స్ తో పాటు కో-యాక్ట‌ర్లు కూడా బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చేలా ప్రోత్సాహిస్తాడ‌ట‌. అందుకే కాబిల్ లో త‌న బెస్ట్ యాక్టింగ్ బ‌య‌టకు వ‌చ్చింద‌ని ఈ అమ్మ‌డు చెప్పుకొచ్చింది.

కాబిల్ సినిమాలో యామీ బెస్ట్ యాక్టింగ్ చూడ‌బోతున్నార‌ట ప్రేక్ష‌కులు. ఈ సినిమా తెలుగులో బ‌లం పేరుతో డ‌బ్ అవుతోంది. మ‌రి నిజంగానే యామీ యాక్టింగ్ లో ఇర‌గ‌దీసిందా.. లేక అమ్మ‌డు మాట‌ల‌తోనే స‌రిపెట్టిందా.. అనేది ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత తేలిపోనుంది.