ఆ సంబంధం తేలితే విడాకులకి ఓకే…

Posted November 25, 2016

if the affair with keep is proved then divorce can be approvedవివాహేతర సంబంధం కారణం గా విడాకులు తీసుకోవచ్చని సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయం వ్యక్తం చేసింది .ఇటీవల తన భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణతో కర్ణాటకలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.తాను అవమానాలకు గురయ్యాయని భావిస్తూ ఆరోపణలు ఎదుర్కొన్న మహిళ కూడా ప్రాణాలు తీసుకొంది. ఈ క్రమంలో ఆమె తల్లి, సోదరుడు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ వ్యక్తి భార్యను వేధించి, మానసిక క్రూరత్వానికి గురిచేయడం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తూ కర్ణాటక హైకోర్టు, దిగువ కోర్టు నిందితునికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించాయి. దీని పై అప్పీల్ కి వెళ్ళటం తో ….కేవలం వివాహేతర సంబంధం భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 498ఏ (వివాహితను భర్త, ఆమె కుటుంబ సభ్యులు వేధించడం) కిందికి రాదని కోర్ట్ పేర్కొంది.

‘భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడం, భార్యకు దానిపై అనుమానం పెంచుకోవడం…ఈ ఒక్క అంశాన్నే మానసిక క్రూరత్వానికి కింద పరిగణించలేం. అందువల్ల ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ సెక్షన్‌ 306కింద కేసు నమోదు చేయలేర’ంటూ పేర్కొంది. నిజ నిజాలను పరిశీలించాకే కేసు నమోదు చేయాలని అభిప్రాయం పడింది .