ఇల్లి బేబ్ కు షాక్ ఇచ్చారట..!

Posted December 22, 2016

Ileana Shock For Her Missing Offers From Tollywoodదేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరిలో మహేష్ తో నటించి భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ సినిమా నుండి టాప్ హీరోయిన్ గా అందరితో జతకట్టిన ఇల్లి బేబ్ బాలీవుడ్ నుండి పిలుపు రాగానే ఇక్కడ కమిట్ అయిన సినిమాలను కూడా లెక్క చేయకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇక్కడ దర్శక నిర్మాతలందరు ఆమె మీద కాస్త కోపం పెంచుకున్నారు. అక్కడ ఫ్లాప్ అవడంతో ఇక్కడకు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని చూసినా లాభం లేకుండా పోయింది.

ఈ మధ్యనే బీ టౌన్ లో హిట్ అందుకున్న ఇలియానా అక్కడ ఒకటి రెండు సినిమాలు చేస్తుంది. ఇక రీసెంట్ గా ఓ తెలుగు సినిమాలో ఆమెను తీసుకునే ఆలోచనతో చర్చలు జరుపగా అంతా ఓకే అనుకున్న టైంలో చివరకు తనను కాకుండా వేరే హీరోయిన్ తో ఆ సినిమా స్టార్ట్ చేశారట. తనను ఇలా ఎందుకు టార్గెట్ చేశారో అమ్మడికి అర్ధం కాక బాగా ఫీల్ అవుతుంది. బాలీవుడ్ వెళ్లడం తప్పేం కాదు కాని సడెన్ గా ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చి వాటిని క్లియర్ చేయకుండా వెళ్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఆమె తెలుసుకుంది. మరి సౌత్ లో ఎవరు ఇలియానాకు ముందు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తారో చూడాలి.