బాలయ్యకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్

0
101

 Posted May 9, 2017 at 10:39

international driving licence to balakrishnaబాలయ్య నలభై రోజులు షూట్ కోసం పోర్చుగల్ వెళ్తున్నారు. ఇలా వెళ్లే ముందే ఆయన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. పూరిజగన్నాధ్ తో చేస్తున్న సినిమా కోసమే బాలయ్య అర్జెంట్ గా ఈ లైసెన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ టాక్సీ డ్రయివర్ కమ్ గాంగ్ స్టర్. పోర్చుగల్ లో తీసే సీన్స్ లో చాలా వరకు ఈ డ్రయివింగ్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ వున్నట్లు తెలుస్తోంది.

అయితే కేవలం షూటింగ్ కోసం డ్రయివింగ్ లైసెన్స్ అవసరం లేకుండా మేనేజ్ చేసే అవకాశం వుంది. కానీ ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్న బాలయ్య, ఇప్పుడు రెండు విధాలా పనికి వస్తుందని అప్లయి చేసినట్లు తెలుస్తోంది. పూరి సినిమాలో బాలయ్య చాలా వరకు టాక్సీ డ్రయివర్ గా కనిపిస్తారు. ఆపై గాంగ్ స్టర్ పాత్ర రివీల్ అవుతుంది.

గతంలో సమరసింహా రెడ్డిలో కూడా బాలయ్య టాక్సీ నడుపతూ వుంటాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్య మరోసారి టాక్సీ డ్రయివర్ పాత్రలో కనిపించబోతున్నారన్నమాట. రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ బాషాలో కూడా ఫస్టాఫ్ ఆటో డ్రైవర్ గా కనిపిస్తే.. తర్వాత హీరో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ రివీల్ అవుతుంది. అప్పుడు రజినీకి ఆటో సెంటిమెంట్ వర్కవుట్ అయినట్లే.. ఇప్పుడు బాలయ్యకు కూడా ట్యాక్సీ కలిసొస్తుందని అభిమానులు నమ్ముతున్నార