విలన్ గా ఎన్టీఆర్..!

Posted December 16, 2016

Is Ntr Turn Again Villain For A Movieఏంటి విలన్ గా ఎన్టీఆర్ చేస్తున్నాడా అని షాక్ అవ్వొచ్చు.. ఇక్కడ ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు నందమూరి తారక రత్న. హీరోగా ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన తారకరత్న హీరోగా ఎలాగు క్లిక్ అవ్వలేదని కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి రీసెంట్ గా రాజా చెయ్యి వేస్తేతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తారకరత్న మాత్రం విలన్ గా ఆడియెన్స్ మెప్పుపొందాడు. అయితే మరోసారి అలాంటి విలనిజం ప్రదర్శించబోతున్నాడు ఎన్టీఆర్ అదేనండి తారకరత్న.

శ్రీరామదాసు నిర్మాత సాయి బాబు తనయుడు రేవంత్ హీరోగా చేసిన మొదటి సినిమా ఇంటింటా అన్నమయ్య రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఆ కుర్రాడు ఇప్పుడు సెకండ్ సినిమా ‘రాజా మీరు కేక’ చేస్తున్నాడు. శోభిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మిస్తుందట. ఈ సినిమాలో విలన్ గా ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా తారకరత్న ఆ ఛాన్స్ కొట్టేశాడు.

హీరోగా ఎలాగు సూపర్ హిట్ అందుకోని తారాకరత్నం విలన్ గా అయినా హిట్లు సాధిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం అదే కాకుండా ఇంకా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. జగపతి బాబు లాగా తారకరత్నకు కూడా విలన్ గా టర్న్ తీసుకోవడం కెరియర్ కు బూస్టప్ ఇచ్చిందని చెప్పేయొచ్చు.