‘బాహుబలి 2’ టార్గెట్‌ ‘దంగల్‌’, ‘పీకే’.. సాధ్యమేనా?

0
118

Posted April 25, 2017 at 18:17

is prabhas bahubali 2 movie crossed aamir khan pk and dangal movie collections
ప్రపచం వ్యాప్తంగా ఈనెల 28న ‘బాహుబలి 2’ విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా విడుదల కాని స్థాయిలో దాదాపు 8 వేలకు పైగా స్క్రీన్స్‌లలో విడుదల అవ్వబోతుంది. ఇంత భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా కలెక్షన్స్‌ విషయంలో రికార్డులు నమోదు చేయడం ఖాయం అని, పాత రికార్డులను తుంగలో కలవడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ ఇండియన్‌ నెం.2గా నిలిచింది. అప్పుడు ‘పీకే’ సినిమాకు దగ్గరగా వెళ్లి ‘బాహుబలి’ ఆగిపోయింది. ఇప్పుడు ‘బాహుబలి 2’కు ‘పీకే’తో పాటు ‘దంగల్‌’ కూడా పోటీగా ఉంది.

‘బాహుబలి 2’ ముందు ప్రస్తుతం ఆ రెండు సినిమా కలెక్షన్స్‌ రికార్డులు ఉన్నాయి. మొదటి నుండి కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ రావాల్సిందే, అంటూ పట్టుదలతో ఉన్న నిర్మాతలు మరియు దర్శకధీరుడు రాజమౌళి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సినిమా తీయడంలో శక్తివంచన లేకుండా కృషి చేసిన జక్కన్న ఇప్పుడు ప్రమోషన్‌ విషయంలో కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన సినిమాగా ‘పీకే’ ఉంది. 792 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను పీకే సాధించి నెం.1 స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘దంగల్‌’ చిత్రం 730 కోట్ల రూపాయలతో నెం.2 స్థానంలో ఉంది. నెం.3 స్థానంలో 650 కోట్ల రూపాయలతో ‘బాహుబలి’ ఉంది. ఇప్పుడు ‘బాహుబలి 2’ టార్గెట్‌ 800 కోట్లు రూపాయలు. ఈ మార్క్‌ను దాటడం పెద్ద కష్టమేమి కాదేమో అని ప్రస్తుతం వీస్తున్న ‘బాహుబలి’ పవనాలను చూస్తుంటే అనిపిస్తుంది.