‘సాహో’ క్యాన్సిల్‌ అవుతుందా ఏంటి?

0
113

 

is prabhas saaho movie cancelled
‘బాహుబలి 2’తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్‌ తన తర్వాత సినిమాను సుజీత్‌ దర్శకత్వంలో ‘సాహో’ టైటిల్‌తో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్శకుడు సుజీత్‌ నెలకో కథ, లేదా మార్పులు చేర్పులు చెబుతూ వస్తున్నాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సుజీత్‌ ఖాళీగా ఉండలేక కథనం లేదా కథలో ఏదో ప్రతి సారి మార్చుతూ నిర్మాతలు మరియు హీరోకు చెబుతూ వస్తున్నాడు.

మూడు సంవత్సరాల క్రితమే సుజీత్‌ దర్శకత్వంలో చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్‌ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ హామీ మేరకు సుజీత్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ప్రభాస్‌ ఆసక్తి చూపుతున్నాడు. కాని ప్రభాస్‌కు సుజీత్‌ విధానం ఏమాత్రం నచ్చలేదని, ప్రతి సారి ఏదో ఒక మార్పు చెప్పి విసిగిస్తున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. దాంతో తాజాగా ప్రభాస్‌ చాలా సీరియస్‌ అయ్యి మళ్లీ మార్పులు అంటే సినిమాను క్యాన్సిల్‌ చేయాల్సి ఉంటుందని, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌తో మొదట తాను ఒప్పుకున్న కథతో రావాలంటూ సూచించాడట. అలా కాకుంటే సినిమాను క్యాన్సిల్‌ చేసినా చేయవచ్చు అంటూ టాక్‌ వినిపిస్తుంది. కుర్రతనంతో సుజీత్‌ ఇలా ప్రవర్తిస్తున్నాడని కొందరు అంటున్నారు. సినిమా ప్రారంభం అయితే క్యాన్సిల్‌కు సమస్యే లేదు. పూజా కార్యమ్రాలు అయితే అయ్యాయి కాని, రెగ్యులర్‌ షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.