నీ సినిమా రిలీజ్ ఉందా తరుణ్..?

Posted February 6, 2017

is tarun idi naa love story movie releaseఅంజలి, సూర్య IPS, తేజ సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మాస్టర్ తరుణ్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్… ఆ తర్వాత నువ్వేకావాలి సినిమాతో హీరోగా  ఎంట్రీ ఇచ్చాడు. ఆ సంవత్సరం సూపర్ డూపర్  హిట్  సినిమాల్లో  టాప్ స్థానాన్ని దక్కించుకుంది ఈ సినిమా. ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వే నువ్వే వంటి లవ్ స్టోరీస్ లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు.

అయితే ఆ తర్వాత  వరుస ఫ్లాపులు రావడం, ఫిజిక్ సరిగ్గా మెయిన్ టేన్ చేయకపోవడం, పలు రకాల వివాదాల్లో చిక్కుకోవడంతో ఇతని సినీ కెరీర్ కి కాస్త  బ్రేక్ పడింది. కాస్త కాదులెండి  లాంగ్ బ్రేకే పడింది.  ఆ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నానని చెప్పిన ఈ లవర్ బాయ్  చెప్పిన విధంగానే ఓ సినిమాను కూడా ఎనౌన్స్ చేశాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన సింపుల్ అగి ఒండు లవ్ స్టోరీ అనే మూవీకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వివరించాడు.

  ‘ఇది నా లవ్ స్టోరీ’ పేరుతో 2015లో ప్రారంభమైన ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. గత ఏడాది ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసి త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నమంటూ ప్రకటించాడు కూడా. అయితే ఆ తర్వాత నుండి సినిమాకు  సంబంధించిన ఒక్క కబురు కూడా బయటకు రాలేదు. అయితే నిర్మాతలు  ఈ సినిమాను డీమానిటైజేషన్  కారణంగా తాత్కాలికంగా ఆపేశారని  యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా  ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం ఈ సినిమా అటకెక్కేసిందని చెబుతున్నాయి. అసలు ఈ సినిమా రిలీజ్ ఉందో లేదో  ఇక తరుణే చెప్పాలి.