ఇజం మూవీ రివ్యూ…

 Posted October 21, 2016

ism movie reviewచిత్రం : ఇజం (2016)
నటీనటులు : కళ్యాణ్ రామ్, అధితి ఆర్య
సంగీతం : అనూప్ రూబెన్స్
దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : కళ్యాణ్ రామ్
రిలీజ్ డేట్ : 21 అక్టోబర్, 2016.

‘ఇజం’.. రిలీజ్ కి ముందే జనంలో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. ‘ఇజం’ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పూరి-కళ్యాణ్ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగిపోయింది. టీజర్ తో ఇది పక్కా పూరి మార్క్ సినిమా అని ఫిక్సయ్యారు. కళ్యాణ్ కటౌట్, డైలాగ్ డిలవరీ చూసి.. మరోసారి పూరి మాయచేయబోతున్నాడని చెప్పుకొన్నారు. ‘పటాస్’ కళ్యాణ్ మళ్లీ ఫాంలోకి రావడం కూడా అంచనాలు రెట్టింపు అవ్వడానికి కారణమయ్యాయి. ఇంతటీ భారీ అంచనాల మధ్య ‘ఇజం’ ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల
ముందుకొచ్చింది. ‘ఇజం’ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించింది. కళ్యాణ్ రామ్ కష్టం ఫలించిందా.. ? ఇంతకీ ‘ఇజం’ కథేంటీ.. ?? తెలుసుకునేందుకు రివ్యూలోకి
వెళదాం పదండీ..

కథ :
సత్య మార్తాండ్ (కళ్యాణ్ రామ్).. ఓ జర్నలిస్ట్. దేశంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలని చూసి చలించిపోతాడు. ఇందుకు తన చిన్నతనంలో జరిగిన ఓ
ఘటన కూడా అతనిలో బలంగా నాటుకుపోతుంది. బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని డిసైడ్ అవుతాడు. ఇందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ జావెద్ భాయ్ (జగపతి బాబు)కు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తాడు. జావెద్ భాయ్ కు సత్య ఎలా దగ్గరయ్యాడు. అతని ద్వారా విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బుని ఎలా ఇండియాకి తెప్పించాడు.. ? సత్య ఫ్లాష్ బ్యాక్ ఏంటీ.. ?? కథలో అధితి ఆర్య ఎవరు.. ??? ఇంతకీ సత్య తన లక్ష్యాన్ని పూర్తి చేశాడా.. ???? అన్నది పూరి మార్క్ తో కూడిన మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
* కళ్యాణ్ రామ్
* డైలాగ్స్
* సినిమాటోగ్రఫీ
* ప్రీ క్లైమాక్స్
* ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :
* ముందే ఊహించే కథ
* సెకాండాప్
* జగపతి బాబు క్యారెక్టర్ ని సెకాండాఫ్ లో సిల్లీగా చూపించేశారు.

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
పూరి-కళ్యాణ్ రామ్ కలయికలో ఓ చిత్రం అనగానే పెద్దగా అంచనాలులేవ్. ఏదో సాదాసీదా చిత్రం వస్తుందనుకున్నారు. ఎప్పుడైతే ‘ఇజం’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యిందో.. అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయ్. టీజర్, ఆడియోతో ‘ఇజం’ పూరి మార్క్ సినిమా అనే ముద్రపడింది. అయితే, రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో పాల్గొన్న పూరి, కళ్యాణ్ రామ్ ఒకరిపై మరోకరు కాస్త ఎక్కువగానే చెప్పుకొన్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటనకి అవార్డులు రావడం ఖాయామని పూరి స్టేట్ ఇవ్వడం, సినిమా రిలీజ్ తర్వాత పూరి గురించి గంటసేపు మాట్లాడతానని కళ్యాణ్ చెప్పడం చూసిన జనాలు వీరు కాస్త అతి చేస్తున్నారని అనుకొన్నారు. ఇపుడు తెలిసిందే ‘ఇజం’ గురించి వారు చెప్పింది నిజమేనని.

ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటన చిత్రానికే హైలెట్. గత సినిమాలతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ నటనని కళ్యాణ్ కనబర్చారు. ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో జీవించేశాడు. ఇక, పూరి వియానికొస్తే.. పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనే చెప్పాలి. సెకంఢాఫ్ లో వచ్చే సన్నివేశాలని ముందే ఊహించవచ్చు. విలన్ రోల్ లో జగపతిబాబు క్యారెక్టర్ ని ఫస్టాఫ్ లో పవర్ ఫుల్ గా.. సెకాంఢాఫ్ లో పవర్ లెస్ గా చూపించడం ప్రేక్షకుడికి నచ్చకపోవచ్చు. సమాజంలోని అవినీతి రోతని చూపించే సన్నివేశాలని ఇంకా లోతుగా చాపిస్తే బాగుణ్ను. మొత్తానికి పూరి సగం న్యాయమే చేశాడు. సెకాంఢాఫ్ లో కూడా తన మాయ చూపిస్తే.. ‘ఇజం’ రిజల్ట్ మరో రేంజ్ లో ఉండేది. హీరోయిన్ అధితి ఆర్య నటనకి పెద్దగా స్కోప్ లేదు. పాటల్లో అందంగానే కనిపించింది. జగపతి బాబు ని ఇంకా
ఉపయోగించుకోవాల్సి ఉంది. మిగితా నటీనటులు ఓకే.

సాంకేతికంగా :

అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బాగుంది. జునైద్ ఎడిటింగ్ ఓకే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని మరింతగా పెంచేశాయి. ఇది కళ్యాణ్ రామ్ కి సినిమా పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
‘ఇజం’లో హీరోయిజం అద్భుతంగా ఉంది. నందమూరి అభిమానులు, ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అభిమానులకి ‘ఇజం’ బాగా నచ్చేస్తుంది. పూరి మార్క్ సినిమాలు ఇష్టపడేవాళ్లు ‘ఇజం’ ఒకటికి రెండు సార్లు చూసేయొచ్చు. కళ్యాణ్ రామ్ నటన అక్కడక్కడ పూరి మార్క్ ‘ఇజం’ని డ్యామేజ్ కాకుండా కాపాడాయి.

బాటమ్ లైన్ : ‘ఇజం’.. నిజంగా ఫర్వాలేదు
రేటింగ్ : 3/5