వైసీపీ ఉత్సాహానికి ఆంధ్రజ్యోతి కారణం?

Posted December 17, 2016

jagan alert in costal area because of andhrajyothi survey
జగన్ అధినేతగా ఉన్న వైసీపీ ….ఆర్కే ఆధ్వర్యంలో నడిచే ఆంధ్రజ్యోతి ….ఈ రెంటి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని వేరే చెప్పనక్కర్లేదు. కానీ ఈ వైరమే అనూహ్యంగా జగన్ కి మేలు చేసింది. ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రకటించిన సర్వే చూసి జగన్ నైతికంగా దెబ్బ తింటాడని చాలా మంది భావించారు.అయితే ఆంధ్రజ్యోతి వేసిన ఆ రాళ్లనే మెట్లుగా మార్చుకుని జగన్ ముందుకెళ్తున్నారు.అదెలాగ అనే కదా మీ డౌట్ .

ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వే లో 2014 ఎన్నికల నాటికి ఇప్పటికి పార్టీల బలాబలాల్లో పెద్ద తేడా లేదని ప్రచురించింది. కోస్తాలో జగన్ ఏ మాత్రం బలం పుంజుకోలేదని ఆంధ్రజ్యోతి సర్వే తేల్చింది. అప్పటికప్పుడు వైసీపీ వర్గాలు ఆ సర్వే ని కొట్టిపారేసినా ఆ తర్వాత జగన్ దాన్ని సీరియస్ గా తీసుకుని వర్క్ చేయడం మొదలెట్టారు.కోస్తాలో పార్టీ బలోపేతం మీద ప్రత్యేక దృష్టి సారించారు.ఆ చర్యల ఫలితమే ఇటీవల ఆ పార్టీకి పెరిగిన చేరికలు.దుర్గేష్,వెల్లంపల్లి శ్రీనివాస్,కాసు మహేష్ ఇలా ఒకరితర్వాత ఒకరు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఓ వైపు బాబు నోట్ల రద్దు వ్యవహారంలో చిక్కుకుంటే జగన్ మాత్రం ఈ చేరికలతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపారు. ఒకప్పుడు ఆంధ్రజ్యోతి సర్వే ని తిట్టిన వైసీపీ నేతలే తమ అధినేతని అలెర్ట్ చేసి మంచి జరిపించారని లోపాయికారీగా పొగడ్తలు కురిపిస్తున్నారు.