చంద్ర‌బాబును నిరాశ‌ప‌రుస్తున్న‌ జ‌గ‌న్!!

Posted February 2, 2017

jagan disappointing chandrababu
అసెంబ్లీలో ప్రధాన ప్ర‌తిప‌క్షం అంటే అధికార పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాలి. ప్ర‌భుత్వ త‌ప్పొప్పుల‌ను ఎత్తి చూపుతూ… ప్ర‌జా సమ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాలి. కానీ ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అలా లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిజానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ఎంత‌సేపు సీఎం అవ్వాల‌న్న ఆరాటం త‌ప్పిస్తే…. అపోజిష‌న్ లీడ‌ర్ తానే అన్న మాట‌ను ఆయ‌న మ‌రిచిపోయినట్టున్నారు. అందుకే ఆయ‌న చేయాల్సిన ప‌నుల‌ను ప‌క్క‌న బెట్టేస్తున్నారు. అందుకే జ‌గ‌న్ తీరు… చంద్ర‌బాబును కూడా నిరాశ‌కు గురిచేస్తోంది.

టీడీపీ… ప్ర‌స్తుతం కేంద్ర‌మంత్రివ‌ర్గంలో ఉంది కాబ‌ట్టి…. అన్ని విష‌యాల్లోనూ వారిపై సీరియ‌స్ గా మాట్లాడ‌లేదు. కానీ ఆ అవ‌కాశం జ‌గ‌న్ కు ఉంది. ప్ర‌త్యేక హోదా అయినా… ప్యాకేజీ అయినా… ఇత‌ర అంశాలేవైనా ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన‌వి చాలా ఉన్నాయి. ఆ అంశాల‌పై జ‌గ‌న్ పోరు చేయాలి. త‌ద్వారా రాష్ట్రానికి లాభం జ‌ర‌గ‌డంతో పాటు వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కూ లాభం వ‌స్తుంది. మ‌రి జ‌గ‌న్ ఈ ప‌ని ఎందుకు చేయ‌డం లేదో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. చివ‌ర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా జ‌గ‌న్ ఇంత‌మంచి అవ‌కాశాల‌ను ఆయ‌న ఎందుకు జార‌విడుచుకుంటున్నారని … ఆయ‌న తీరుపై అసంతృప్తిగా ఉన్నార‌ట‌.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు… ప్ర‌ధాన ప్ర‌తిపక్షాన్ని కూడా రాష్ట్రా భివృద్ధిలో భాగం చేయాల‌ని ఆలోచిస్తున్నారు. ఆదిశ‌గా క‌లిసి రావాల‌ని జ‌గ‌న్ కు ఎప్పుడో పిలుపునిచ్చారు. ఆయ‌న మాత్రం నేను రానంటూ… మొహం చాటేస్తున్నారు. రాజ‌ధాని అంటే జ‌గ‌న్ అంత ఎత్తుకు లేస్తున్నారు. క‌నీసం ఈ విష‌యంలోనైనా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తే బావుండేది. ఇలా చేస్తే వైసీపీకి కూడా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉండేది. దాన్ని కూడా ఆయ‌న జారవిడుచుకున్నారు. చివ‌ర‌కు బ‌డ్జెట్ విష‌యంలోనూ ఆ పార్టీ ఆచి తూచి స్పందించింది.

రాజ‌కీయాల్లో అవ‌కాశాలను ఒడిసి ప‌ట్టుకోవాలి. లేకుండా ఇతర‌పార్టీలు ఆ అవ‌కాశాన్ని వాడుకుంటాయి. ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతోంది అదే. జ‌గ‌న్ ఏ విష‌యంలోనూ సీరియ‌స్ గా లేక‌పోవ‌డంతో… ఆయ‌న‌కు రావాల్సిన ఫోక‌స్ అంతా ఇప్పుడు ప‌వ‌న్ పైకి వెళ్లిపోయింది. ప‌వ‌న్ ఏం మాట్లాడినా అది వార్త అవుతోంది. ప్రభుత్వం కూడా ఆయ‌న చెప్పిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తోంది. ఏదేమైనా ప‌వ‌న్ కు ఉన్నంత పొలిటిక‌ల్ నాలెడ్జ్ అయినా… జ‌గ‌న్ కు లేదని బాబు … త‌న స‌న్నిహితుల‌తో చిట్ చాట్ లో చెప్పార‌ట‌. ఇప్ప‌టికైనా ఆయ‌న తీరు మార్చుకోక‌పోతే జ‌గ‌న్ ను ప‌వ‌న్ డామినేట్ చేసి దూసుకుపోవ‌డం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు అంచనా వేస్తున్నార‌ట‌.