జగన్ డూప్లికేట్ రెడ్డా!!

Posted December 27, 2016

jagan duplicate reddyసాధారణంగా వైసీపీని రెడ్ల పార్టీగా చెబుతుంటారు. ఎందుకంటే దాని అధినేత రెడ్డి కాబట్టి. కానీ ఈ మధ్య టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అసలు జగన్ నిజమైన రెడ్డి కాదట. ఆమాటకొస్తే ఆయన రెడ్డే కాదట. ఆయన పక్కా క్రిస్టియన్ అని చెప్పుకొచ్చారు జేసీ.

కంప్యూటర్ యుగంలో కులాలకు పట్టుకొని వేలాడమేంటి? అంటారు చాలామంది రాజకీయ నాయకులు. కానీ టికెట్ల దగ్గరకు వచ్చేసరికి కొన్ని కులాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఇలా జేసీ కూడా ఈకాలంలోనూ కులాలేంటి అని చెప్పుకొచ్చారు. అలా అంటూనే జగన్ కులాన్ని ప్రస్తావించారు. అయితే జేసీ వాదనలో నిజం లేకపోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

జేసీ చెప్పినట్టుగా జగన్ నిజంగా క్రిస్టియనే. పేరులో రెడ్డి ఉన్నా… వారి కుటుంబమంతా జీసస్ నే ఫాలో అవుతుంది. మరి అంతమాత్రాన జగన్ రెడ్డి కాదా.. అంటే రెడ్డే కానీ.. కన్వర్టెట్ క్రిస్టియన్. అంత మాత్రాన అసలు రెడ్డి కాదు అని చెప్పగలం. ఆయన ఏమతంలో ఉంటారన్నది ఆయన వ్యక్తిగత విషయం. దీనిపై అనవసరంగా కాంట్రవర్సీ చేయడమేంటో… జేసీ గారికే తెలియాలి.

ఇంతకీ జేసీ గారు ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. జగన్ ఒరిజినల్ రెడ్డా.. డూప్లికేట్ రెడ్డా అన్నది పక్కనబెడితే .. ఆయన పార్టీ ఇప్పటికే రెడ్ల పార్టీగా గుర్తింపు పొందింది అన్న వాస్తవాన్ని జేసీ విస్మరించినట్టున్నారు. రెడ్లకు ఫేవరెట్ పార్టీ కూడా వైసీపీనే అంటారు చాలామంది నాయకులు. అందుకేనేమో ఇతర పార్టీల్లో ఎక్కడా అంత మంది రెడ్డి నాయకులు లేరు!! తల్లి కాంగ్రెస్ లోని చాలామంది రెడ్లు పిల్ల కాంగ్రెస్ లో కనిపిస్తున్నారు!!