రాజధానిలో జగన్ వాయిస్ ..ఎకరాకు 15 కోట్ల డిమాండ్

Posted January 19, 2017

jagan fire on chandrababu in amaravathi tour about Seed Access Road
ఆంక్షల మధ్యే వైసీపీ అధినేత జగన్ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు.తాడేపల్లి పాత టోల్ గేట్ ,కుంచనపల్లి సహా వివిధ చోట్ల జగన్ కి ఘన స్వాగతం లభించింది.పెనుమాక,ఉండవల్లిలో ఇళ్లు,పొలాలు కోల్పోయిన వారితో జగన్ సమావేశమయ్యారు.సీడ్ యాక్సిస్ రోడ్ పేరుతో రైతుల భూముల్ని అన్యాయంగా లాక్కుంటున్నారని అయన బాబు సర్కార్ పై ధ్వజమెత్తారు.రైతుల నుంచి ఈ రోడ్ కోసం లాక్కుంటున్న అతి విలువైన భూములకు ఎకరాకు 15 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు.ఈ వ్యవహారంపై ఏమన్నారో …ఆయన మాటల్లోనే వినండి ..

సీడ్ యాక్సెస్ అని రోడ్డు పెట్టి.. ఆ రోడ్డు కోసం బలవంతంగా  దాదాపు 300 కుటుంబాలను నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 25 ఎకరాలను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. ఇప్పటికే సూరాయపాలెం నుంచి వెంకటాయపాలెం వరకు ఎస్ హెచ్ 5, ఎన్ హెచ్ 9 లింకు చేస్తూ.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వయా ఇబ్రహీంపట్నం మీదుగా గుంటూరు వరకు  కనెక్షన్ రోడ్డుకు    గత ప్రభుత్వ హయాంలోనే భూములు తీసుకున్నారు. అయితే రెండున్నర సంవత్సరాలుగా ఆ రోడ్డు పనులు చంద్రబాబు చేపట్టలేదు. నిజంగా అది పూర్తైతే ఈ రోజు సీడ్ కేపిటల్ రోడ్డుతో పనే ఉండేది కాదు.. కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎవరైనా సరే మొదటిగా చేయాల్సింది ఆ పని. భూ సమీకరణ జరిగి ఉన్నా ఆ రోడ్డు పనిని కావాలనే కమీషన్ల కోసమే ముట్టుకోలేదు. ఇప్పుడు ఈ భూములను కూడా బలవంతంగా సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుమీద లాక్కుంటున్నారు. .. రూ. 15కోట్లు విలువ చేసే భూమికి రూ. 30లక్షలు మాత్రమే ఇస్తానంటున్నారు. ఇదిక్కడి విధానం.. అభివృద్దికి వ్యతిరేకం కాదు.. పూర్తిగా డబ్బులు ఇచ్చి భూములు తీసుకోండి..  వైఎస్ జగన్