మోడీని నమ్ముకొని జగన్ అడుగులు..

Posted December 6, 2016

jagan follow to modi for election
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పొలిటికల్ స్ట్రాటజీ ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా జారిపోతుండడంతో ఆయన కొంత డిఫెన్స్ లో పడిపోయారు. ఈ దశలో ఎప్పుడూ ఆయన ఉన్న వారికైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఆయన కొంత తేరుకున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన పార్టీ మీటింగ్ ఇందుకు ఉదాహరణ.

ఇటీవల జరిగిన మీటింగ్ లో జగన్ కొన్ని సంచలన విషయాలు మాట్లాడారు. ప్రధాని మోడీ యూపీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ముందొస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పారట జగన్. ఈ విషయంలో ఆయనకు ఢిల్లీ నుంచి ఏమైనా లీకు ఉందో లేదో తెలియదు కానీ .. ఇలా జగన్ ఎందుకు చెప్పారని ఎవరికీ అర్థం కాని విషయం. అంతేకాదు వైసీపీ అధినేత మరోమాట కూడా పార్టీ నేతలకు చెప్పారట. మోడీ ఎలాగూ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు. కాబట్టి ఏపీలోనూ మిడ్ టర్మ్ ఎన్నికలొస్తాయి. ఇక వైసీపీకి తిరుగులేదని చెప్పుకొచ్చారట. అంటే మోడీని నమ్ముకొని జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలకు వెళ్తానని మోడీ ఎవరికైనా చెప్పారా? ఏపీలోనూ అలా జరుగుతుందా? జగన్ ఏంటి? ఇలా మాట్లాతున్నారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. 2019 వరకు సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే మోడీ ఎందుకు వెళ్తారు? ఏదో పార్టీ నాయకుల్లో ధైర్యం చెప్పడానికే జగన్ ఇలా చేసి ఉంటారని చెబుతున్నారు చాలామంది. ఇందులో వాస్తవం ఉందో తెదో కానీ… మోడీని నమ్ముకొని రాజకీయాలు చేద్దామంటే జగన్ కు కలిసి రాకపోవచ్చంటున్నారు పరిశీలకులు.