లోకేష్ ని తిడితే జగన్ జీతం…బుక్ అయ్యాడుగా?

Posted April 21, 2017 at 17:05

jagan give money to who scold tdp party people
పొలిటికల్ పంచ్ పేరుతో లోకేష్ టార్గెట్ గా సెటైర్స్ వేస్తూ పోలీసులకి దొరికిపోయిన ఇంటూరి రవికిరణ్ ని విచారిస్తే షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయట.వైసీపీ తరపున సోషల్ మీడియా టీం ఒకటి చురుగ్గా పనిచేస్తోందట. ఈ టీం పని ఒక్కటే సోషల్ మీడియా లో టీడీపీ,చంద్రబాబు, లోకేష్ ని భ్రష్టుపట్టించే విధంగా పోస్ట్ లు పెట్టి వాటిని విరివిగా ప్రచారం చేయడమే.ఈ టీం సాక్షి కి అనుబంధంగా పనిచేస్తుంది.జీతాలు కూడా సాక్షి నుంచే వస్తాయి.ఇలా జగన్ జీతమిచ్చి లోకేష్ ని తిట్టిస్తున్నాడన్నమాట.

ఇలా వైసీపీ ఓ సోషల్ మీడియా టీం ని తయారుచేసి దుష్ప్రచారం చేస్తున్నట్టు జర్నలిస్ట్ సర్కిల్స్ లో ఎంతోమందికి తెలుసు.అయితే టీడీపీ లో ఈ విషయాన్ని పట్టించుకునే వారు లేకపోవడంతో ఎవరికివారు మిన్నకుండిపోయారు.దీంతో విషయం లోకేష్ దాకా వచ్చింది.అప్పటికి గానీ ప్రభుత్వం, పార్టీ మేలుకోలేదు. ఇప్పుడు రవికిరణ్ విచారణలో సాక్షి జీతాలు చెల్లిస్తోందని తేలడంతో జగన్ బుక్ అయిపోయాడు.దీనిపై ఈడీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ భావిస్తోంది.