హమ్మయ్య ..! జగన్ నోరు విప్పాడు

Posted November 23, 2016

jagan-mohan-reddyఎట్టకేలకు వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నోట్ల రద్దు పై నోరు విప్పారు. పొద్దున్నే రాజముండ్రి లో ప్రెస్ మీట్ పెట్టి నోట్ల రద్దు గురించి తన కి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పారు. మోడీ తీసుకున్న నిర్ణయం సూపర్ అంటూనే రద్దు చేసిన పద్దతి బాలేదని, ఫలితం గా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు తీరు ఏమి బాగా లేదని నోట్ల రద్దు నిర్ణయం తాను రాసిన లెటర్ వల్ల జరిగినదని ఒకసారి, ఇప్పుడు పరిస్థితిని బట్టి మాట మారుస్తూ కేంద్రం నిర్ణయం తప్పు అనటం ఆయనకే చెల్లిందని అన్నారు.

కొత్త నోట్లు పూర్తిగా చెలా మణిలోకి వచ్చే వరకు క్రెడిట్ ,డెబిట్ కార్డు లను వాడాలనిచెప్పడం, కూలికి వెళ్లే సామాన్య ప్రజల వద్ద కార్డులు ఎలా ఉంటాయి అని ప్రశ్నించారు .కేంద్ర కాబినెట్ లో తెలుగు దేశం పార్టీ ఎంపీ లు వున్నారు కాబట్టి ముఖ్య మంత్రి బాధ్యత తీసుకొని వ్యవహరించాలని అన్నారు

నోట్ల రద్దు పై ఇప్పుడు తనకి ఫుల్ క్లారిటీ వచ్చిందని ఎప్పటి కప్పుడు పార్టీ ప్రతినిధులు నోట్ల రద్దు అంశం పై మాట్లాడిస్తున్న అని అన్నారు, ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే మాట్లాడాలని వేచిచూసా అన్నారు , నోట్ల రద్దు కారణం సామాన్యులు పడుతున్న ఇబ్బందులను బట్టి కేంద్రం చర్యలుతీసుకోవడం లో విఫలం అయ్యిందని ,బ్లాక్ మనీ ని నిరోధించటం మంచిదే ఐనా ఎటు వంటి నిర్ణయాలు తీసుకొనే ముందు జాగ్రత్త తీసుకోవాలని అన్నారు . నోట్ల రద్దు అంశం ముందుగా చంద్రబాబు కి తెలుసునని హెరిటేజ్ వాటాలను ముందుగా అమ్ముకున్నది ఆయనే అని విమర్శించారు.