జగన్ కి ఆ ఒక్క ఛాన్స్ దూరమైంది.

0
99

Posted May 1, 2017 at 15:32

jagan is not getting a single chanceదూరాన్ని కిలోమీటర్లలో కొలుస్తాం.అనంతవిశ్వంలో సుదూర తీరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తాం.కానీ జగన్ కి మిస్ అయిన ఆ ఒక్క ఛాన్స్ దూరమో,సుదూరమో,స్వప్నమో అర్ధం కాని పరిస్థితి.ఇంతకీ జగన్ దూర తీరాన కనిపిస్తున్న ఆ ఒక్క ఛాన్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాలా? సీఎం కుర్చీ.ఒక్కసారైనా దానిపై జగన్ చేయని ప్రయత్నం,పోరాటం లేవు.కానీ మా వైపే వున్నాడు ఆ దేవుడు అని జగన్ ఎన్నిసార్లు చెబుతున్నా ఆ దైవం మాత్రం ఆ ఒక్క ఛాన్స్ దక్కనివ్వడం లేదు.2014 ఎన్నికల్లో గెలుపు ఖాయం అనుకున్న జగన్ కి జనం హ్యాండ్ ఇచ్చారు.అప్పటినుంచి ఇదిగో ఎన్నికలు,అదిగో ఎన్నికలు అంటూ జగన్ కలవరించడం జనం చూస్తూనే వున్నారు.ఆయన ఆరాటమే గానీ ఎన్నికలు మాత్రం ముందుకు రాలేదు.కానీ చంద్రబాబు ఓ ఆరునెలలు ముందుగానే ఎన్నికలు జమిలి ఎన్నికలు రావొచ్చని చేసిన ప్రకటనతో జగన్ కి పట్టలేని హుషారు వచ్చింది.

రాజకీయ బద్ధశత్రువు చేసిన ప్రకటనని ఎంతవరకు విశ్వసించవచ్గు అన్న ఆలోచన కూడా లేకుండా చెలరేగిపోయారు.వెంటనే ఎన్నికల వ్యూహం రచించడానికి బీహార్ బాబు ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దించే ప్రయత్నం చేశారు.సర్వేలు,అభ్యర్థులు అంటూ ఊహాలోకంలో తేలిపోయారు.కానీ జగన్ ఇంకోసారి చుక్క ఎదురైంది.ముందస్తు ఎన్నికలు లేవని కేంద్రం తేల్చేయడంతో జగన్ దిగాలు పడటం ఖాయం.కానీ ఈ వారం రోజుల్లో జగన్ చేసిన హడావిడి చూస్తే ఆయనకి ఎన్నికలు,సీఎం కుర్చీ అంటే ఎంత మోహమో జనానికి ఇంకోసారి కళ్ళకి కట్టినట్టు అర్ధమైంది.ముందస్తు ఎన్నికల విషయంలో చంద్రబాబు పప్పులో కాలేసాడు అనుకున్నాం గానీ జగన్ ని ఎక్స్ పోజ్ చేయడానికే ఈ నాటకం ఆడి ఉండొచ్చు కూడా ..